Home ఖమ్మం అంగన్‌వాడీ కేంద్రం అస్తవ్యస్తం

అంగన్‌వాడీ కేంద్రం అస్తవ్యస్తం

  • సక్రమంగా అమలుకాని ఆరోగ్యలక్ష్మి పథకం
  • గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం
  • చుట్టపు చూపుగా తనిఖీ చేస్తున్న అధికారులు

Khammam_Anganvadi_CSబోనకల్: శిశు మరణాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో శిశుసంక్షేమ శాఖ ఐసిడి ఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడి కేంద్రాలను నిర్వహిస్తుంది. గ్రామాల్లో కేంద్రా ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు. గ్రామాల్లో అంగన్‌వాడి కేంద్రాలు ఎప్పుడు తెరచి ఉంటాయో తెలియని అయో మయ పరిస్ధితిలో గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. ఒకవేళ కేంద్రాలు తెరిచి ఉన్నా అందులో పిల్లలు మాత్రం ఉండరు. ఇది అంగన్‌వాడి కేంద్రాల పరిస్ధితి. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడు తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంగన్‌వాడి కేంద్రాలపై తనిఖీ చేయా ల్సిన అధికారులు చుట్టపు చూపుగా క్షేత్రపర్యటనలు చేస్తుంటారని తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుంటారని ప్రజలు వాపోతున్నారు. అసలు అంగన్‌వాడి కేంద్రా లకు సరఫరా చేసే వస్తువుల వివరాలు ప్రజలకు ఇంత వరకు తెలియదు. మరోవై పు అంగన్‌వాడి కేంద్రాలకు పక్కా భవనాలు లేకపోవడం, కనీస సౌకర్యాల లేమితో సమస్యల వలయంలో అంగన్‌వాడి కేంద్రాలు కొట్టుమిట్టాడు తున్నాయి. మండలం లో కలకోట, బోనకల్ సెక్టార్లలో 58 అంగన్‌వాడి కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 31 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉండగా, 27 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అద్దె భవనాలు దొరకక కేంద్రాల నిర్వహణ ఇబ్బంది కరంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు గదులు, వరండా, మరుగుదొడ్లతో కలిపి 600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని అద్దెకు తీసుకుని కేంద్రాన్ని నిర్వహించాలి. ఇందుకు గాను ప్రభుత్వం అద్దెకింద రూ.750 చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యాలతో ఇళ్ళు అద్దెకు దొరకక పోవ డంతో తూతూ మంత్రంగా ఒక గదిని అద్దెకు తీసుకుని కేంద్రాలు నడుపుతున్నారు. ఐసిఇడిఎస్ అధికారులు కేవలం రూ.200 మాత్రమే చెల్లించి చేతులు దులుపు కుంటున్నారు. పిల్లలకు మరుగుదొడ్ల సౌకర్యం, ఆట స్థలం లేకపోవడంతో అంగన్ వాడి కేంద్రాలకు పిల్లలు రావడం లేదు.
ఆరోగ్యలక్ష్మిపథకానికి గ్రహణం: గర్భిణిలు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అధికారుల నిర్లక్షం కారణంగా సక్రమంగా అమలు జరుగడంలేదు. దీంతో ప్రభుత్వ లక్షం నెరవేరే పరిస్థితి కనుబడుట లేదు. మండలంలో 3200మంది 7 నెలల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు అంగన్‌వాడి కేంద్రాలకు వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. అదే విధంగా 900 మంది గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా పౌష్టికాహారానికి సంబంధించి ప్రభుత్వం నుండి సరఫరా సక్రమంగా జరుగడంలేదు. గర్బిణిలు, బాలింతలకు ప్రతి రోజు మోను ప్రకారం అన్నం, ఆకుకూర, పప్పు, గుడ్డుతో భోజనంతో పాటు 200 ఎంఎల్‌ల పాలు అందించాల్సి ఉంది. ప్రతి రోజూ అంగన్‌వాడి కేంద్రానికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలనేది ప్రభుత్వ నిబంధన. అంగన్‌వాడి కేంద్రాలు దూరంగా ఉండటంతోపాటు, సక్రమంగా తెరవకపోవడం వల్ల గర్భిణిలు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఇష్టపడటం లేదు. దీంతో ఆదిలోనే హంస పాదు అన్న చందాన ఆరోగ్య లక్ష్మి పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రారంభానికి నోచుకోని అంగన్‌వాడి కేంద్రాలు: మండలంలో ఇటీవల 10 అంగన్‌వాడి కేంద్రాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.7.50 లక్షలు మంజూరు అయ్యాయి. కాని మొదటి విడతగా రూ.4.50 లక్షలు మాత్రమే రావడంతో కేంద్రాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రావినూతల, గార్లపాడు గ్రామాల్లో అంగన్‌వాడి కేంద్రాలు మం జూరు అయినప్పటికి నిర్మాణం మొదలు పెట్టకపోవడం విశేషం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణపై దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కల్లూరు మండలంలో మౌలిక వసతులు కరువు…
కల్లూరు: కల్లూరు మండలంలో మౌలిక వసతులు లేక అంగన్‌వాడి కేంద్రాల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో వంద అంగన్‌వాడీ కేంద్రాలు కలవు. అంగన్‌వాడి కేంద్రాలలో మంచినీటి, మరుగుదొడ్లు సౌకర్యం, ఆటస్థలం తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. దీనికిగాను ఆయా అంగన్‌వాడి కేంద్రాలలో మరుగుదొడ్డి సౌకర్యం, ఆటస్థలాలు లేకపోవడంతో అంగన్‌వాడి కేంద్రాలకు వస్తున్న పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. వీరికిగాను రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలనుంచి అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణలోకాని, మౌలిక వసతులు కల్పించడంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్షం వహిస్తుంది. కేంద్రానికి పిల్లలను పంపించాలన్నా పలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 0-5లోపు పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలంటే కనీసం కొన్ని గంటలపాటు నిర్వహించాల్సి ఉంది. దీనిలో మధ్యలో విశ్రాంతి తీసుకోవాలన్నా సిబ్బంది అవస్తలు పడాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఇకనైనా స్పందించి పూర్తిస్థాయిలో అంగన్‌వాడి కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సిడిపిఒ వివరణ: మండలంలో వంద అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయని వాటిలో 39 కేంద్రాలలో మౌలిక వసతులు లేవని ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియపర్చామని సిడిపిఒ వరలక్ష్మి ‘మనతెలంగాణ’కు వివరించారు.