Home తాజా వార్తలు అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా

అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా

31 LPT 01 31 LPT 02నిజామాబాద్: మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేయడంతో అవి పనికి రాకుండా పోయాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం స్థానిక సర్పంచి పొడవొల్ల బాలమణిలక్ష్మన్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. కేంద్రంలో దుర్వాసన రావడాన్ని పసిగట్టిన సర్పంచి ఆరా తీయగా కోడిగుడ్లు కుళ్లిపోయినవి వచ్చాయనీ అందుకే దుర్వాసన వస్తోందనీ అంగన్‌వాడీ కార్యకర్త అనూరాద చెప్పడంతో సర్పంచి విస్తుపోయారు. పసి పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా కుళ్లిపోయిన గుడ్లను పంపిణీ చేస్తారా అంటూ సర్పంచి కార్యకర్తను ప్రశ్నించారు. కేంద్రానికి సరఫరా చేసిన 48 కోడిగుడ్లు పూర్తిగా కుళ్లిపోయాయనీ, వాటిని పిల్లలకు, తల్లులకు ఇవ్వకూడదనీ సర్పంచి సూచించారు. కుళ్లిన గుడ్ల సరఫరాపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె చెప్పారు.