Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

అండర్ వరల్డ్ డాన్‌గా…

Sudeep_Pathట్విట్టర్‌లో తన వ్యాఖ్యలతో, సినిమా ల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టి స్తూ ఉండే రామ్‌గోపాల్‌వర్మ ప్రస్తుతం గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితంలోని కొన్ని సం ఘటనల ఆధారంగా ‘కిల్లింగ్ వీర ప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కన్నడ పరిశ్రమలోనూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోన్నాడు వర్మ. తెలుగు, హిందీ ల్లోనూ ఈ సినిమాను తెరకెక్కిస్తు న్నారు. ఇదిలాఉంటే తాజాగా తన కు బాగా కలిసి వచ్చిన అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ మరో సిని మా చేసేందుకు సిద్ధం కావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. బెంగళూర్ నేపథ్యంలో సాగే ఈ అండర్‌వరల్డ్ సిని మాకు వర్మ అప్పుడే ‘అప్పా’ అనే పేరును ఖరారు చేశారు. బెంగళూర్‌కు చెందిన ముత్తప్పారాయ్ అనే అండర్ వరల్డ్ డాన్ జీవిత కథ ఆధారంగా ‘అప్పా’ను తెరకె క్కించనున్నాడట. ఈ సినిమాకు తన అభి మాన నటుడైన సుదీప్‌ను హీరోగా ఎంపిక చేసినట్లు తెలిసింది. సుదీప్ కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నా డట. ఇక కన్నడలో స్టార్ హీరోయి అయిన సుదీప్ ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించాడు. వర్మ తన స్టైల్లోనే తెరకెక్కించనున్న ఈ అండర్ వరల్డ్ సినిమా త్వర లోనే సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది.

Comments

comments