Home తాజా వార్తలు అక్రమాలకు కళ్లెం

అక్రమాలకు కళ్లెం

rr12రెండు నెలల్లో 56 కేసులు
బినామీలపై కేసులు…
సరకు రవాణాకు ఆధునిక టెక్నాలజీ
డీలర్ల వద్ద రిజిస్టర్‌లో తేడాలున్నా కేసులు
వరుసగా అక్రమాలు చేస్తే పీడీ కేసులు
జాయింట్ కలెక్టర్ అమ్రాపాలి
మన తెలంగాణ/రంగారెడ్డి: జిల్లాలో పౌర సరఫరాలలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటు జిల్లా యంత్రాంగం ముందుకు పోతుంది. జిల్లాలో మాఫియాగా మారి వ్యాపారం చెస్తున్న వారిపై పౌరసరఫరాల శాఖ అధికారులు, ఎస్‌ఓటి పోలీసులు గత రెండు నెలలుగా చెపడుతున్న దాడుల వలన ప్రస్తుతానికి అక్రమాలకు తాత్కలిక బ్రేక్ పడింది. జిల్లాలో పౌర సరఫరాలలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి గత రెండు నెలలలో 56 కేసులు నమోదు చెయడం జరిగింది. చౌక ధరల దుఖాణలు నడుతుపు అక్రమాలకు పాల్పడుతున్నవారిని సైతం 6 గురిని గుర్తించి శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. బియ్యం అక్రమ రవాణ పై నిఘా ఉంచుతు , తీసుకోవలసిన చర్యలపై రేషన్ డిలర్లతో సమావేశములు నిర్వహించి కావలసిన హెచ్చరికలు చెయడంతో పాటు సరుకు నిల్వలపై ప్రత్యేక ఫార్మాట్‌ను ఇవ్వడం జరిగింది. బినామీలను గుర్తించడానికి చెసిన దాడుల వలన 32 కేసులు నమోదు చెయడం జరిగింది. భవిష్యత్‌లో అక్రమాలకు అవకాశం లేకుండా సరుకు రవాణా వాహనాలకు జిపియస్‌తో అనుసందానం , దుఖాణాలలో పిఓయస్ యంత్రాలను అమర్చుతున్నారు.
అక్రమాలను వదలం; జాయింట్ కలెక్టర్ ఆమ్రాపాలి
పౌర సరఫరాలలో అక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా వ్యవహరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఆమ్రాపాలి తెలిపారు. జిల్లాలో గత రెండు నెలల నుంచి చెపట్టిన చర్యలను వివరిస్తు శంషాభాద్‌కు చెందిన ప్రవిణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నందుకు పిడి యాక్టు నమోదు చెయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పౌరసరఫరాలలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంటే 040-23297256కు పిర్యాదు చెయాలని కోరారు.