Home భద్రాద్రి కొత్తగూడెం అగ్ని గుండం

అగ్ని గుండం

Strong   hot winds

నిప్పులు కక్కుతున్న భానుడు
నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
ఎండ వేడిమి తట్టుకోలేక పోతున్న వృద్ధులు, చిన్న పిల్లలు
బలంగా వీస్తున్న వేడి గాలులు

మన తెలంగాణ/భద్రాచలం టౌన్ : వాతావరణం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. నింగిలోని సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎటు చూసినా వేడిగాలులు వెంటాడుతున్నాయి. ఎఁడా కాలం గండం గట్టేక్కేదెట్లా అంటూ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. గడిచిన రోజుల్లో కంటే రోహిణీ కావడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. భద్రాచలంలో సోమవారం సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గం.ల వరకు చూస్తే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తప్ప ని సరి పరిస్థితుల్లో తప్ప ఎవ్వరు బయటకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. బయటకు వచ్చిన వారు సైతం టోపీలు, స్కార్పులు ముసుగు ధరించడంతో కొంత తీవ్రతను తట్టుకుంటున్నప్పటికీ వేడి గాలులు శరీరంలోని తేమ (సోడియం) శాతాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో కొద్ది సేపటికీ డీలా పడిపోతున్నారు. భద్రాచలం పట్టణంతో పాటు డివిజన్లోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నింగి నిప్పులు కక్కుతుండటంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఉదయం గం.8 నుంచి భానుడి ప్రతాపం ప్రారంభం కావడంతో  చిన్నపిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం సమయానికి తట్టుకోలేక పోతున్నారు. ధనికులు ఏసి గదుల్లో సేద తీరుతున్నప్పటికీ మధ్య తరగతి ప్రజలు మాత్రం సాధారణ కూలర్ల క్రింద, పేదలు చెట్ల క్రింద కాలం వెళ్ల దీస్తున్నారు. విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ వేడి గాలులు బలంగా వీస్తుండటంతో