Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అటకెక్కిన కంప్యూటర్ విద్య..

computerఆదిలాబాద్: విశ్వమంతా కంప్యూటర్ల మయం అయ్యింది. ఎక్కడ చూసిన సాంకేతిక పరిజ్ఞానం. ప్రస్తుతం ప్రపంచం కంప్యూటర్, ఇంటర్‌నెట్ రంగాలలో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగ విధ్యాసంస్థలో ఈ టెక్నో, ఆ టెక్నో ప్రచారాలు చేస్తూ పిల్లలకు కంప్యూటర్‌ల ద్వారా విద్యాను అందిస్తూ, విద్యార్థులను ఆకర్శిస్తుంటే ప్రైవేట్ రంగానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయని చెప్పుకుంటున్న ప్రభుత్వం మాత్రం పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లనే పట్టించుకోకపోవడం లేదు. దీంతో కంప్యూటర్‌లు ఉపయోగానికి నోచుకోక బూజు పట్టిపోతున్నాయి. కంప్యూటర్ విద్యను బోధించే అద్యాపకులు లేక విద్యార్థులకు కంపూటర్ విద్య అందని ద్రాక్షగానే మారిపోతుంది..

మండలంలోని కుభీర్, కస్తూర్భా గాంధీ, పల్సి, నిగ్వా, మాలేగాం, పార్డి(బి) తదితర పాఠశాలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్య అందిచాలని గత ప్రభుత్వం 2010లో ఎంతో ప్రతిష్టాత్మికంగా ప్రవేశ పెట్టిన కంప్యూటర్ విద్య విద్యార్థులకు దక్కడం లేదు. మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమవుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి, కంప్యూటర్‌లు, ప్రింటర్లు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కరెంట్ సమస్యను అదిగమించేందుకు జనరేటర్ సదుపాయాన్ని సైతం కల్పించారు. కానీ ప్రస్తుతం కంప్యూటర్ పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక గదుల్లో ఉన్న కంప్యూటర్‌లు వెలవెల బోతున్నాయి. ఏల్ల తరబడి నిరుపయోగంగా ఉండడంతో బూజుపట్టి దుమ్ముపాలవుతున్నాయి. కంప్యూటర్ విద్య నేర్చించాలి…..(సాప సాయినాధ్ 10వ తరగతి)
కండ్ల ముందు కంప్యూటర్‌లు ఉన్న మాకు నేర్పేందుకు టీచర్‌లు లేరు. 10వ తరగతి పూర్తి అవుతున్న కంప్యూటర్‌ల గురించి ఏమి తెలియకుండా పోతుంది. అధికారులు కల్పించుకొని 10వ తరగతిలోపు విధ్యార్థులకు కంప్యూటర్ విద్యను అందిస్తే భవిష్యతుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Comments

comments