Home తాజా వార్తలు అదనపు గదుల నిర్మాణం పై అలసత్వమెందుకు

అదనపు గదుల నిర్మాణం పై అలసత్వమెందుకు

RR_Rooms_Schools“ప్రకటనలకేముంది పటామని పదిమాటలంటే సరిపోతుంది. కాని ఆచరణలో సైతం అదేవిధంగా వ్యవహరించకుండా నిర్లక్షపునీడలో అధికారులు, నాయకులు వ్యవహరిస్తూ చిన్నారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ”

  • సంవత్సరాలు గడుస్తున్నా అందని ఆర్వీఎం నిధులు
  • విద్యార్థులకు తప్పనితిప్పలు
  • మంజూరుకాని బిల్లులతో కాంట్రాక్టర్లకు తడిసిమోపెడు

కుల్కచర్ల: విద్యార్థుల సౌకర్యార్థం అవసరం ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తదితర విషయాలను పరిగణలోకి తీసు కుని రాష్ట్రీయ విద్యా మిషన్ అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టా లని నిర్ణయించింది.  పనుల నిర్వ హణను తీసుకున్న కాంట్రాక్టర్లు సంబంధిత కార్యక్రమాలన్నీ ప్రారంభించి పనులను సైతం మొదలుపెట్టారు. కాని కొంత మేరకు పనులు పూర్థైన సంబం ధిత పనులకు బిల్లులు రాక పోవడంతో ఇబ్బందికి గురైన నిర్వహణ నిర్మాణదారులు 75 శాతం పనులను పూర్థి చేసి అక్కడితో వదిలేయడం జరిగింది. ఆర్వియం ద్వారా నిర్వహాణ జరగడంతో సంబంధిత శాఖా ద్వారా నిధులు రావాల్సి ఉంది. సకాలంలో నిధులు రాకపోవడంతో అటు విద్యార్థులకు ఇటు నిర్వాహణదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కుల్కచర్ల మండల పరిధిలో పలు గ్రామాలలో అదనపు గదులు మంజూరు కావడం జరిగింది. మండల పరిధిలోని సాల్వీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దగ్గరలో విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతిని నిర్మించడం జరిగింది. సంవత్సరం గడిచినా పూర్థిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో గదులు కూడ పూర్థికాలేకపోయాయి. అసంపూర్థిగా నిర్మితమైన భవనం పలు పలు విదాలైన ఇబ్బందులతో కట్టకముందే దానిరూపురేకలు మారేవిధంగా అవుతున్నాయి. భవిష్యత్తు పౌరుల గూర్చి ప్రభుత్వం, అదికారులు ఈ విధమైన నిర్లక్షాన్ని చూపడం వల్ల పాలనా పరమైన లోపాలు బహిర్గతమవడంతో పాటుగా విద్యార్థులకు పరోక్షంగా నష్టం చేకూర్చుతున్నారు.