Search
Friday 16 November 2018
  • :
  • :

అప్పుల ఊబిలో రైతన్నలు

  • పెట్టిన పెట్డుబడులు చేతికందని దుస్థితి నెలకొంది
  • ఎండ వేడిమితో మొలకెత్తని పత్తి నీరందని పెసరది అదే తీరు!

Warangal_Farmer_Problemsఖరీఫ్ సాగు కర్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. వచ్చి పోతున్న కారుమబ్బుల వైపు చూస్తున్న అన్నదాతల ఆశలు ఫలించటం లేదు. వరుణుడు కరుణించక పోవడం కర్షకులకు ఈ ఏడాది అప్పుల భారం మిగిలేలా ఉందని పల్లెరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు –  మరిపెడ

మరిపెడ: ఖరీఫ్ సాగు కర్షకులకు కన్నీళ్లు మి గిల్చింది. వ చ్చి పోతున్న కారుమబ్బులు చూసి ఊరడిల్లుతున్న అన్నదాతల ఆశాలు ఫలించటం లేదు. వరుణిడి కరుణ లేకపోవటం మూ లన కర్షకులకు ఈ ఏడాది అప్పుల భారం మిగిలేల ఉందని పల్లెరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న మరిపెడ మండలంలో వరుణుడి కరుణమీద ఆధారపడి సాగు కొనసాగుతుంది. వర్షలు మినహా ఇతర నీటి వనరులు లేకపోవటం మూలన అన్నదా తలు పకృతి కరుణిస్తే తప్ప సాగు పనులు ముందుకు సాగటం లేదని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. వర్షాలు లేకపోవటం తో పాటు పెరిగిన ఉష్ణోగ్రతలు సైతం రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. గత రబీ, ఖరీఫ్‌లో అతివృష్టి, ఆనావృష్టితో ఆవస్థలు పడిన కర్షకలోకం ఈ ఏడాది సైతం అప్పుల ఊబిలో కురుకుపోవాల్సిన దయనీయ దుస్థితి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది.పెట్టిన పెట్టుబ డులు సైతం చేతికి అందే పరిస్థితి లేకపోవటం మూలన మరిపెడ మండలంలోని ఆకేరు, పాలేరు పరివహక గ్రామాలైన చిన్నగూడురు, విసంపల్లి, ఉగ్గంపల్లి, జయ్యారం, పురుషోత్త మయగూడెం, మంగోరి గూడెం, ఉల్లెపల్లి గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లోను సాగు పనులు ముందుకు సాగటం లేదు. ఖరీప్ ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు పెసర, పత్తి విత్తనాలు వేసుకున్న రైతులకు నిరాశే ఏదురైంది. పెసర చేతికి అందే పరిస్థితి లేకపోగా పత్తి విత్తనాలు మొలకెత్తకపోవ టంతో మరోమారు విత్తనాలు వేసి మొలక కొసం రైతులు ఏదురుచూపులు చూస్తున్నారు. గుండెపూడి, ఈ ఏడాది తుది నుంచి సాగు నిరాశజనకంగా సాగుతుండటం మూలన అన్నదాతలు అప్పుల ఊబిలో కురుకుపోతు న్నారు. సాగు పనులు ముమ్మరంగా కొనసాగి చేతినిండ పని ఉండాల్సిన క్రమంలో రైతులు నిరాశ వివిధ కులవృత్తు వారితో పాటు వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా చేస్తుంది.
కరువు సహాయక చర్యలు తీసుకోవాలి:
టి రైతుసంఘం
ఈ ఏడాది ఖరీఫ్‌లో అతిస్వల్ప వర్షాపాతం నమోదు కావటం మూలన సాగుపనులు ముందుకు సాగటం లేదని దీంతో పల్లెల్లో కరువుఛాయాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం రైతులకు మనోస్థైర్యం కల్పిస్తూ కరువు సహాయక చర్యలపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం మండల నాయకులు పోగుల శ్రీనివాస్ గౌడ్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.పెట్టిన పెట్టుబడులు సైతం చేతికి అందే పరిస్థితి లేకపోవటం మూలన రైతులు, కౌలుదారులు పట్నలకు వలసపోతున్నారని దీంతో పల్లెల్లో కరువు బీతవహం ఏర్పాడిందని ప్రభుత్వం గుర్తించి కర్షకులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

comments