Search
Sunday 18 November 2018
  • :
  • :

అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు

 ప్రతిబంధకంగా మారిన రుణ మాఫీ వ్యవహారం 

 ఇప్పటికీ కరువైన స్పష్టత
 ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
 స్పందించని యంత్రాంగం

Still-from-Bitter-Seedsఆదిలాబాద్: ప్రస్తుతం జిల్లా రైతాంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మాఫీ చేసిన సంగతి దేవుడెరుగుగానీ వడ్డీ చెల్లిస్తామన్నా బ్యాంకుల ద్వారా రుణం దొరకని పరిస్థితి ఏర్పడింది. రుణ మాఫీపై సరైన విధాన రూపకల్పన చేపట్టక పోవడం బ్యాంకులకు ప్రభుత్వం ద్వారా మాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ సీజన్ మొదలయ్యేటప్పుడే రుణాలు అందించాల్సిన బ్యాంకులు ఇప్పటి వరకూ కనీస స్థాయిలో స్పందించకపోతుండడం విమర్మలకు తావిస్తోంది. అన్నీ ప్రభుత్వ రంగం వాణిజ్య బ్యాంకులు రుణ మాఫీ విషయంలో రైతులకు స్పష్టతను ఇవ్వడం లేదు.

లక్ష రూపాయల లోపు రుణ మాఫీలో భాగంగా మొదటి దశ కింద రూ. 25 వేల రుణంను మాఫీ చేసినట్లు మొదట చెప్పుకున్న బ్యాంకులు ప్రస్తుతం మాఫీతో సంబంధం లేకుండా మొత్తం లక్ష రూపాయలకు వడ్డీని కట్టాలం టూ రైతులను హెచ్చరిస్తున్నాయి.

02adadb21p1కొత్తగా రుణం కావాలని బ్యాంకులకు వెళ్ళే రైతులకు అక్కడి అధికారులు కొత్తగా పెడుతున్న తిరకాసులు అయోమయానికి లోను చేస్తున్నాయి. బ్యాంకు అధికారుల తిరకాసు కారణంగా ఆశగా వెళ్ళిన రైతులు తీవ్ర నిరాశ నిస్ర్పహతో తిరిగి వస్తున్నారు. ఇలా ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా రుణాల కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం ఏ రైతును కదిలించినా రుణం వ్యవహారాన్నే తెరపైకి తెస్తున్నాడు. బ్యాంకుల సహాయ నిరాకరణను పసిగట్టిన ప్రైవేటు వ్యాపారులు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని పావులు కదపుతున్నారు. 5 నుండి 10శాతం వడ్డీతో ప్రైవేటు వ్యాపారులు రైతులకు అప్పులిచ్చేందుకు పోటీ పడుతున్నారు.
అన్నదాత అప్పుకోసం అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ఈ దిశగా స్పందించాల్సిన యంత్రా ంగం చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తోంది. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాల తడుముకున్న చందంగా అధికారులు రుణం విషయంలో బాధ్యతను ఒకరిపై నుంచి ఇంకొకరి పైకి నెట్టేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి సహాయ నిరాకరణతో అల్లాడిపోతున్న రైతును రుణాల కోసం ఆదు కోనట్లైతే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం లేకపో లేదంటున్నారు.

Comments

comments