Home జిల్లాలు అమ్మపాలు అమృతపు జల్లు

అమ్మపాలు అమృతపు జల్లు

* నేటినుంచి తల్లిపాల వారోత్సవాలు
* తల్లిపాల విశిష్టతపై ప్రచార భేరి

1162889.large

ముర్రుపాలు తప్పనిసరి ఎందుకంటే:

* బిడ్డపుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు.
* ఇవి కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందుతాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ ‘ఏ’ ఉంటుంది.
* వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవితకాలం కాపాడుతాయి.
* శిశువు ప్రేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడుతాయి.
* తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే.
* బిడ్డపుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తే నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయకూడదు.
* ఆరు నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా రోజూ 8నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి.

తల్లికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం:

* గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెలుల్లిపా య, తాజా కూరగాయాలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.
* ఆహారంలో తీపి పదార్థాలు (స్వీటు కాదు) అంటే సహజ రంగా దొరికే పండ్లు శుభ్రం కడిగిన తర్వాత తినాలి.

బిడ్డకు లాభాలివీ:

* తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి.
* నాణ్యమైన ప్రొటీన్లు అంది మొదడు వికసిస్తుంది.
* ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
* ఇందులోని లాక్టోజ్ వల్ల కాల్షియం నిల్వలు పెగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.
* తొలి నెలలో శిశువలకు వివిధ రకాల అంటువ్యాధుల బారి నుంచి కాపాడుతాయి.
* బిడ్డ మృదువైన మల విసర్జనకు, మలబద్దకం సమస్య నివారణకు తోడ్పడుతాయి. జీర్ణ మండలాన్ని వృద్ది చేస్తాయి.
* తల్లిపాల ద్వారా బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడొచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధ/లు, గుండెజబ్బుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.
* ఎలర్జీ, అస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధులురావు.
* బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.

తల్లికీ బోలెడు లాభాలు:

* తల్లులు చనుబాలు ఇవ్వడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చనుబాలు ఇచ్చినందు వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు.