Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అవయవదానంపై అవగాహన అవసరం

05KNR10P1కరీంనగర్ టౌన్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మైత్రి హోటల్ అపోలో రీచ్ ఆసుపత్రి గ్రూప్ నిర్వహించిన అవయవ దానం అవగాహన సదస్సు కలెక్టర్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు తమ అవయవాలను దానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించి, అవయవ దానానికి ప్రోత్సహిస్తామని అన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం వలన 9 మందికి జీవితాన్ని ప్రసాదించ వచ్చని వైద్యులు చెబుతున్నారని అన్నారు. మనిషి మరణించి కూడ జీవించే అవకాశం ఈ అవయవ దానం వలన కలుగు తుందన్నా రు.

రక్త దానం ,నేత్ర దానం కార్యక్రమాలు చేపట్టి నట్లు గానే అవయవ దానం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా తీసుకురావాలని అన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ , ప్రైవేట్ ఆసుపత్రుల, స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతామని కలెక్టర్ తెలిపారు. దీనిపై పట్టణ ప్రాంతాలలో 05KNR10P2కొంత వరకు అవగాహన కలిగి వుందని తెలిపారు. అవయవాలు సమయానికి అందక చాల మంది మరణిస్తారని తెలిపారు. ముఖ్యంగా బ్రేయిన్ డెడ్ అయిన పేషెంట్ల బందువులు అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు. డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ బ్రయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల ద్వారా 9 మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చని తెలిపారు.

అపోలో రీచ్ అడ్మిని స్ట్రేటర్ పి. బాబు రావు మాట్లాడుతూ అపోలో హస్పత్రి వారు దీన్ని సామాజిక బాధ్యతగా , ఇటువంటి అవగాహన సదస్సు మొట్ట మొదట సారి కరీంనగర్‌లో నిర్వహించడం వలన అవగాహన తీసుకువచ్చి కొందరిలోనైన వెలుగునింపుతామనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అపోలో హస్పత్రిలో మొదటి సారిగా అవయవ దానం చేసిన కొండల్ రావు స్మృతులను కొనియాడారు. అంతకు ముందు కలెక్టర్ అవయవ దానం సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అతిథులకు అపోలో మెడికల్ సూపరిడెంట్ డాక్టర్ అనమల్ల నరేష్ వందన సమర్పన తెలుపగా ప్రముఖ వైద్యులు భూంరెడ్డి, రఘురామన్, నరేంద్ర, శ్యాంసుందర్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments