Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అవినీతి గుప్పిట్లో…

విద్యుత్ సబ్‌స్టేషన్లలో నిర్వహణ అవినీతిమయం

రెగ్యులర్ పోస్టుల పేరుతో ఆపరేటర్ల నుంచి వసూళ్ళు
పనులు దక్కించుకునేందుకు ఏజెన్సీల పోటీ

manatelangana logoసిటీబ్యూరో: విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్వహణ అవినీతికి నిల యంగా మారిందనే ఆరోపణలు వస్తున్నా యి. ఆపరేటర్ పోస్టులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కామధేనువుగా మారాయి. దీం తో వీటిని దక్కించుకునేందుకు ఆయా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు అడ్డదారులు తొక్కుతు న్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కాంట్రాక్టరు 40 నుంచి 50 సబ్‌స్టేషన్లు దక్కించుకోగా తా జాగా మరిన్ని సబ్‌స్టేషన్లను తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచా రం. ట్రాన్స్‌కో మెట్రో జోన్ పరిధిలోకి వచ్చిన 54 కొత్త విద్యుత్ ఉప కేంద్రాలకు టెండర్లు ఆహ్వానించగా వీటిని దక్కించుకునేందుకు సుమారు 200 మంది పోటీపడ్డారంటే వీటికి సంబంధించిన పనులకు ఎంత గిరాకీ వుం టుందో సులువుగా తెలుసుకోవచ్చు.

గ్రేటర్ పరిధిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 220కి పై గా ఉండగా వీటిలో స్కాడా (కోర్ సిటీ) పరిధి లోనే 105 ఉన్నాయి. వీటిలో 5 సబ్‌స్టేషన్లు డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో పని చేస్తుండగా మిగిలిన 105 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఆధ్వ ర్యంలో నడుస్తున్నట్లు సమాచారం. ఒక్కో స బ్‌స్టేషన్‌లో నాలుగు ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. విద్యుత్ సరఫరా, డిమాండ్, మీటర్ రీడింగ్‌ను ఎప్పటికప్పుడు వీరు నమోదు చేసుకుంటారు. అయితే అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు, స్థానికత, విద్యార్హత ప్రమాణికంగా తీసుకోవాల్సి ఉండగా స్థానిక డీఈలు, కాంట్రాక్టు ఏజెన్సీలు కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు అభ్యర్థులను ఎంపిక చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా రెగ్యులర్ పోస్టుల పేరుతో ఒక్కో ఆపరేటర్ నుంచి యాభైవేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఇదిలావుండగా జహీరాబాద్ సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సదరు ఔట్‌సోర్సింగ్‌పై అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలో 54 కొత్త 130 కేవీ, 220 కేవీ, 400 కేవీ సబ్‌స్టేషన్లు నిర్వహణకు సంబంధించి ట్రాన్స్‌కో ఇటీవల ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. వీటిని దక్కించుకునేందుకు సుమారు 200 మంది పోటీపడ్డారు. సెంట్రల్ బ్రేక్‌డౌన్ (సీబీడీ) వర్క్‌తో పోలిస్తే సబ్‌స్టేషన్ల నిర్వహణ చాలా సులభం కావడంతో వీటిని దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.

సీబీడీలో రిస్క్ ఎక్కువగా వుండటంతో వీటికి టెండర్ పిలిచినా ఎవరూ రాక పోవడంతో అధికారులు ఆందోళనలో పడ్డారు. ఇదిలాఉంటే సబ్‌స్టేషన్ల నిర్వహణ బిడ్‌కు సంబంధించి బిడ్‌ను ఓపెన్ చేసే సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల మధ్య స్థానికతపై వివాదం తలెత్తింది. తెలంగాణ కాంట్రాక్టరుతో పోలిస్తే సీమాంధ్ర కాంట్రాక్టర్‌కు సీనియార్టీ ఎక్కువ ఉండటంతో వీటిని వారే తీసుకునిపోయే అవకాశం ఉందని భావించిన కొంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఇటీవల ట్రాన్స్‌కో మెట్రోజోన్ కార్యాలయం ముందు ఆందోళనకు సైతం దిగారు.

Comments

comments