Home కరీంనగర్ ఆందోళన వద్దు మంచినీటికి ఢోకా లేదు

ఆందోళన వద్దు మంచినీటికి ఢోకా లేదు

కరీం’నగర’ ప్రజలకు మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ విజ్ఞప్తి 

3, 4 నెలల వరకు మానేరు డ్యాం నీళ్లు సరిపోతాయి
డ్యాంలో ఉన్న చివరిబొట్టు వరకు తీసుకొని సరఫరా చేస్తాం

02KNR05P1కరీంనగర్‌టౌన్‌ః నగర ప్రజలకు మంచినీటికి ఎలాంటి ఇబ్బంది లేదని నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ వెల్లడించారు. . ఆదివారం గీతాభవన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానేరు డ్యాంలో 4 టిఎంసిల నీరు ఉన్నదని 3, 4 నెలల వరకు మంచినీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నగర ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని విజ్ఞప్తి చేవారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలతో పజలు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

వర్షాలు లేక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇబ్బందులు పడుతున్న సంగతి నగర ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. డ్యాంలో ఉన్న చివరిబొట్టు వరకు తీసుకొని మంచి నీరు అందిస్తామని అన్నారు. నగర ప్రజలపై కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే శ్రీరాంసాగర్‌లో ఎంత నీరు ఉన్నదో చెప్పాలని సూచించారు. తక్కువ వర్షాలు పడడం వలనే కొంత ఇబ్బంది పడుతున్న సంగతి నగర ప్రజలకు తెలుసన్నారు. ఇవ్వదలుచుకుంటే సూచనలు ఇవ్వాలని విమర్శలు చేయకూడదని కోరారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2 టిఎంసిల నీరు ఉన్నప్పుడు మంత్రి లకా్ష్మరెడ్డి వరంగల్‌కు నీరు తరలించుకుపోతే కాంగ్రెస్ నాయకులు చేతులు ముడుచుకొని కుర్చున్నారని అప్పుడు ఇతర పార్టీలు ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి సమస్య డ్యాంకు లేదని ప్రజలను అపోహలకు గురి చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మేయర్ ఆరోపించారు. డ్యాం డెడ్ స్టోరేజిలో లేదని నీటిమట్టం 4 టిఎంసిలు ఉన్నదని సమయపాలనకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర ప్రజలకు విన్నవించారు. విలేకరుల సమావేశంలో సునీల్ రావు, ఆరీఫ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సిసి రోడ్డుకు శంకుస్థాపన
నగరపాలక సంస్థను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.10 లక్షల నిధులతో ఆవరణ మొత్తం సిసి రోడ్డుతో నిర్మాణం చేయనున్నారు. అందులో భాగంగా ఆదివారం నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సిపి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంతో పాటు పాలక సంస్థను కూడా తీర్చిదిద్దుతామన్నారు.