Search
Sunday 23 September 2018
  • :
  • :

ఆటోను ఢీకొన్న వజ్ర బస్సు…ఐదుగురు దుర్మరణం

accideint1
నలుగురి పరిస్థితి విషమం, యాదాద్రి జిల్లా గుట్ట మండలం హైదరాబాద్ వరంగల్ హైవేపై ఘోర దుర్ఘటన

యాదాద్రి : యాదాద్రి జిల్లా బాహుపేట గ్రామం వద్ద హైదరాబాద్  వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఆర్‌టిసికి చెందిన వజ్ర బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో వరంగల్ జిల్లా ఆర్‌టిసి డిపో2కు చెందిన టిఎస్ 03 జెడ్ 0348 నెంబర్‌గల వజ్ర బస్సు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తుండగా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామ పరిధిలో గల జాతీయ రహదారిపై ఆలేరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎపి 28 వై 9257 నెంబర్ గల ఆటోను ఆదుపుతప్పి ఢీకొట్టింది. ఆ సమయంలో  ఆటోలో 9 మంది  ప్రయాణిస్తున్నారు.  వీరిలో రమేష్, శ్రీను, కృష్ణ, పూలమ్మ, యాదమ్మలు అక్కడికక్కడే మృతి చెందగా స్రవంతి, అక్ష య, వెంకటేశ్, పాపయ్యలకు తీవ్ర గాయలు కావడంతో సమీపంలోని ఆలేరు ఆసుపత్రికి, ఆనంతరం జనగాం ఆసుపత్రికి తరలించ గా పరిస్థితి మరింత విషమించడంతో వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ లింగయ్య, సిఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments