Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఆ చరిత్రే నన్ను కొత్తగా చూపించింది : క్రిష్

Krishనందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఘన విజయాన్ని అందుకొని దూసుకుపోతోంది. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ “ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..? ఒక దేశాన్ని గెలిచిన గర్వం… తెలుగు నేలంతా నన్ను కౌగిలించుకున్నంత ఉద్వేగం… మౌనం మాత్రమే చెప్పగల భావాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియడం లేదు. చాలా మందికి తెలియని చరిత్రని చూపిస్తే కొత్తగా ఉంటుందనుకున్నాను. కానీ ఆ చరిత్రే నన్ను కొత్తగా చూపిస్తుందని నేననుకోలేదు. నాకైతే… నా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద, కళ్లనిండా మనసు నింపుకొని సినిమా చూసే తీరుమీద, తీర్పు మీద నాకున్న నమ్మకం రుజువైంది. అసంఖ్యాకమైన అభినందనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తెరమీద కరవాల ధ్వనులు, తెర ముందు కరతాళ ధ్వనులు, థియేటర్ల ముందు సాహో గౌతమీపుత్ర శాతకర్ణి అంటూ నినదిస్తున్న ప్రతిధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి చోటా, ప్రతి నోటా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇది తొంబై తొమ్మిది చిత్రాల నటనానుభవాన్ని తన వందవ చిత్రంలో ఆవిష్కరించిన ఒక మహా నటుడి నట విశ్వరూపం.. ఈ విజయం ఆయన అందించిన ప్రోత్సాహ ఫలం. మన తెలుగు ప్రేక్షకులందరికీ ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను… నా జీవితంలో ప్రతి నిమిషాన్ని మీకు చెప్పాల్సిన ఓ కృతజ్ఞతగా భావిస్తాను”అని అన్నారు.

Comments

comments