Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఇందిరమ్మ బిల్లుల కోసం కాంగ్రేస్ నాయకుల ధర్నా

04mdcgtp01మెదక్: పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు మంజూరీ చేయాలని మండల కాంగ్రేస్ ఆధ్వర్యంలో మంగళవారం చేగుంటలో ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్ తో పాటు జిల్లా నాయకులు చెరుకుశ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ బిల్లులు వెంటనే మంజూరీ చేయాలని ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం గాంధీ చౌరస్తాలో దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రేస్ నాయకులు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ అయాంలో ఇందిరమ్మ మంజూరీ అయ్యి ఇల్లు కట్టుకున్న లబ్దిదారులకు బిల్లు ఇవ్వండం లేదని వారికి వెంటనే బిల్లులు అందజేయాలని తెలిపారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి రెండు బెడ్‌రూంలు గల ఇండ్లను కట్టిస్తానని తెలిపిన కెసిఆర్ ఇంత వరకు ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఉపాధ్యక్షులు మల్లేశంగౌడ్, దౌల్తాబాద్ మండల నాయకులు గొవిందరెడ్డి, కుమ్మరిశ్రీను,ఆగం తదితరులు పాల్గొన్నారు.

04mdcgtp01a

 

Comments

comments