Home జిల్లాలు ఉద్రిక్తత నడుమ

ఉద్రిక్తత నడుమ

భన్నప్ప అంత్యక్రియలు
బంధువుల ఆవేశాన్ని చల్లార్చిన మంత్రి పద్మారావు

04SBD01కంటోన్మెంట్: కలకలం రేపిన మారేడుపల్లి సంఘటనలో మృతి చెందిన భన్నప్ప శవానికి పోలీసు బందోబస్తు, ఉద్రిక్తతల మధ్య మారేడు పల్లి శ్మశానవాటిలో అంత్యక్రియలు జరిగా యి. గత రాత్రి ఒక గొడవలో భన్నప్ప అనే వ్య క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని స్వంత పూచీకత్తుపై విడుదల చేసిన వి షయం తెల్సిందే. ఆ తర్వాత భన్నప్ప మరణిం చడంతో అతని బంధువులు, జనం పోలీసుస్టే షన్‌పై దాడిచేసి విధ్వంసం సృష్టించిన ఘటన సంచలనం కలిగించింది. సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం భన్నప్ప శవాన్ని బంధువులకు అ ప్పగించారు. బంధువులు శవాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటి ముందు ఉంచారు. శవాన్ని ద హనం చేస్తారా లేదా ఇంకా ఏమైనా ఆందోళన చేస్తారా అన్న విషయంపై పోలీసులకు, ఇటు బస్తీవాసులకు, నాయకులకు ఏమవుతుందోన ని ఆసక్తి నెలకొంది. దీంతో మంత్రి పద్మారావు కలగజేసుకొని మృతిచెందిన కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూ స్తామని భరోసా ఇవ్వడంతో శాంతించారు. దీనికి తోడు లక్షన్నర రూపాయలు తానే ఆర్ధ్దిక సహాయాన్ని అందిస్తామని చెప్పి ఆయన మృతుని బంధువులతో చర్చించారు. పోలీసు కేసు విషయంలో కూడా ప్రభుత్యంతో చర్చిస్తామన్నారు. దీనికి తోడు ఎంఎల్‌ఎ సాయన్న కూడా అక్కడే ఉండి మృతుడి బంధువులను ఓదార్చి 10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్యం ప్రకటించాలని కోరారు. చివరకు మృతుని బంధువులు చేరుకోగానే అంత్యక్రియలు జరిపారు. పోలీసులు గాంధీనగర్‌లో గట్టి బందోబస్తు నిర్వహించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కన్పించాయి. మృతుని భార్య సమిత్ర(నర్సమ్మ), తల్లి మహదేవమ్మ, సోదరులు సిద్ధి అశోక్, ఇతర బంధువులు తమకు న్యాయం చేయాలని కోరారు.
మంత్రి పద్మారావు చొరవతో ప్రశాంతత
నగరంలో పోలీసుస్టేషనుపై దాడిచేస్తే పోలీసులకే గాయాలయ్యాయని, వారినే రక్షించుకోలేని వారు ప్రజల్ని వారేమి కాపాడతారని విమర్శలు వెల్లువెత్తాయి. మరో వైపున పోలీసుల దెబ్బలకు భన్నప్ప మృతి చెందాడని, ఇది అన్యాయమని కొందరు అంటున్న నేపధ్యంలో నెలకొని ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల నడుమ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి టి.పద్మారావు రాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకూ గాంధీనగర్ బస్తీలోనే బైఠాయించారు. పోలీసులకు, మృతుడి తరుపున వారికి, ఇటు ప్రభుత్యానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి, ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తపడ్డారు. దశల వారీగా మృతుడి బంధువులతో మంతనాలు జరిపి వేడివేడిగా ఉన్న పరిస్థితులను నెమ్మదిగా చక్కదిద్దారు. మృతుడు భన్నప్ప ఎలక్ట్రిషియన్‌గా, డ్రైవరుగా పనిచేస్తూంటాడు. అతనికి ఇద్దరు ఆడ పిల్లలు. నారాయణఖేడ్ ప్రాంతం నుండి ఎప్పుడో బతుకుదెరువు కోసం ఆయన కుటుంబం ఇక్కడికి తరలివచ్చింది. అతనితో పాటు సుమారు 300 వందల కుటుంబాలు వలస వచ్చి గాంధీనగర్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. వారంతా భన్నప్ప కుటుంబానికి అండగా నిలవటం, పోలీసుస్టేషను పైకి దాడికి వెళ్లటం స్థానికంగా సంచలనాన్ని రేకెత్తించింది. వారి యూనిటీకి పోలీసులు, నాయకులు కంగుతిన్నారు. అలాంటి పరిస్థితుల్లో మంత్రి పద్మారావు తనదైనశైలిలో గాంధీనగర్‌బస్తీలో మకాం వేసి, బాధితులను పరామర్శించారు. అక్కడే కూర్చుని దశలవారీగా మంతనాలు జరిపారు. ప్రభుత్వం న్యాయం చేయాలని, అకారణంగా కొట్టి చంపారని, భన్నప్ప చనిపోవటంతో అతని కుటుంబం రోడ్డుపాలైందని, అతని భార్యకు గవర్నమెంటు కొలువు ఇవ్వాలని, ప్రభుత్యం ఆర్థిక సహాయం ప్రకటించాలని బాధితులు కోరారు. ఈ విషయాలన్నీ సిఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారికి హామీయిచ్చారు. దీంతో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. ఇటు పోలీసు డిపార్టుమెంటుకు చెడ్డ పేరు రాకుండా, అటు ప్రభుత్వానికి మచ్చరాకుండా పద్మారావు పరిస్థితిని చక్కదిద్దారు.