Search
Saturday 22 September 2018
  • :
  • :

ఎన్‌టిఆర్ జీవితంలో నిజాలను వక్రీకరించను

                     VARMA

హైదరాబాద్:  “లక్ష్మీస్ ఎన్‌టిఆర్” చిత్రాన్ని వక్రీకరించకుండా తీస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎన్‌టిఆర్ జీవితంలో జరిగిన నిజ సంఘటనలను  వక్రీకరించకుండా తెరకెక్కిస్తానని చెప్పారు.  ఎన్‌టిఆర్ జీవిత చరిత్రపై చంద్రబాబు మాటలు నిజమేనని, బాబు చెప్పిన విధంగానే నిజంగా జరిగిన సంఘటనలు నిజంగా తీస్తానని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ జీవితం తెరిచిన పుస్తకం వంటిదని, పుస్తకంలో చినిగిపోయిన కొన్ని పేజీలను అతికించి సినిమా తీస్తానని ట్వీట్ చేశారు. ఈ సినిమాను వైసిపి నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్నాడు. 2018 ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమై.. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments