Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎయిర్ పోర్టులో బీయమ్‌డబ్లూ కార్ల ప్రదర్శన

06ssbdt03p4రంగారెడ్డిః బీయమ్‌డబ్లూ కంపనీ గురువారం తన కొత్త మాడర్లతో ఎయిర్ పోర్టులో ఏక్సిపీరియన్స్ టూర్2015ని ప్రదర్శించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీయమ్‌డబ్లూ కంపనీ తన కొత్త మోడల్స్‌ను కస్టమర్స్ కోసం ఒక ప్రదర్శనను నిర్వహించింది. ఈ ప్రదర్శనలో తన కొత్త మోడల్స్ అయిన ఐ8 మోడల్ ను ఎక్స్‌ఫోలో ప్రదర్శించింది. ఈ కార్యక్రమాని తిలకించ డానికి చాలా మంది కస్టమర్స్ ఎయిర్ పోర్టుకు విచ్చేసి బీయమ్‌డబ్లూ 1 సీరీస్ సుండి 3 సిరీస్ తో పాటు 5,7 బీయమ్‌డబ్లూ ఎక్స్ 1 మోడల్స్‌ను కస్టమర్స్ డ్రైవ్ చెయ్యడానికి అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా బీయమ్‌డబ్లూ కారు ఇండియన్ రోడ్లపై కూడా సునాయసంగా దూసుకు పోవడంతో పాటు రోడ్లకు అనుగునంగా కార్లను తయారు చెయ్యడం జరిగిందని వారు తెలిపారు. దీనిని నిరుపించేందుకు ఎయిర్ పోర్టులో ఉన్న ఎత్తైన ప్రదేశాలలో, గుంతలలో, ఇరుకాంటి ప్రదేశాలలో బీయమ్‌డబ్లూ కార్లను కస్టమర్స్‌ను కారులో కూర్చూన పెట్టుకోని నడిపి చూపించారు. ఇదే విదంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాని శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిర్వహించనునట్లు కంపనీ వారు తెలిపారు. గతంలో కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3సార్లు ఈ ప్రదర్శనను జరిపామని ప్రదర్శనకు మంచ్చి స్పందన రావడంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాని జరుపుతునట్లు నిర్వాహకులు తెలిపారు. కస్టమర్లు తమకు నచ్చిన బీయమ్‌డబ్లూ కారు ముందు నిలబడి ఫోటోలకు పని చెప్పారు.

Comments

comments