Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఎస్‌సి, ఎస్‌టి చట్టాలపై అవగాహన అవసరం

Awareness on SC and ST Laws is required

కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ 

మన తెలంగాణ/ఆదిలాబాద్: ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించి వారిలో అత్మవిశ్వాసం పెంపొందించి సమాజంలో గౌరవభావం కల్పించాలని ఎస్సీ, ఎస్టీ కమీషన్ రాష్ట్ర చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి పేద వర్గాల ప్రజలకు చట్టాల గురించి తెలియజేసి వారిలో అత్మస్థైరాన్ని పెంచాలని వారికి సమాజంలో ఉన్నత స్థానం కల్పించాలని అన్నారు. వారి అభ్యున్నతి అన్ని వర్గాల వారు. చట్ట ప్రకారం సహకారం అందించాలన్నారు. చట్టాలపై గ్రామాలలో విస్తృత ప్రచారం చేయడం, ముఖ్యంగా ఎస్‌సి ఎస్‌టి చట్టాలపై కేవలం వారికే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయడం ద్వారా నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే విజిలెన్స్, మానిటరింగ్ సమావేశాలలో సభ్యులు భాధ్యతగా వ్యవహరించి కేసుల పురోగతిపై అధికారులతో చర్చించాలని, నేరం చేసిన వారికి శిక్షపడడం ద్వారా నేరాలు తుగ్గుతాయని మరొకరు ఇలాంటి నేరం చేయరని అన్నారు. గ్రామాలలో ప్రతి నెల చివరి రోజున తహసిల్దార్ స్థాయి నుండి కలెక్టర్ వరకు ఎస్‌ఐ నుండి ఎస్‌పి వరకు ఇతర శాఖల అధికారులు పారహక్కుల దినాన్ని నిర్విహించి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలో భూమి కొనుగోలు పథకం అమలుపై అభినందిస్తూ 2014 నుండి ఇప్పటి వరకు 934 మంది లబ్థిదారులకు 2483 ఎకరాలు పంపీణీ చేశారని, ఎస్‌సి, ఎస్‌టి రైతుల భూముల్లో మైకో ఇరిగేషన్ ద్వారా సాగు చేయడానికి జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రజలతో మమేకమై వారికి కావలసిన వాటిని సమకూర్చడం, వారి భాషలోనే భావాలను అర్థం చేసుకొని పనులు పూర్తి చేయడం హర్షనీయమన్నారు.ఎస్‌సి, ఎస్‌టి కేసుల పురోగతి, బాధితులకు పరిహారం అందించడం జరగాలని అన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టి వారికి ప్రయోజనం చేకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక అసమానతలను రూపుమాపడం ద్వారా ఎస్సీ, ఎస్టీలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు జి నగేష్ మాట్లాడుతూ కేసులు నమోదైన వెంటనే విచారణలు కూలంకశంగా చేపట్టాలని తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా చూడాలని, అలాగే తప్పుడు కేసులు పెట్టిన వారిని హెచ్చరించే విధంగా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, జిల్లాలో 2017-18 సంవత్సరానికి సంబంధించిన 5 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. తప్పుచేసిన వారికే హైకోర్టు నుండి స్టే రాకుండా చూడాలని, బాధితులకు ప్రభుత్వ పరంగా పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో పెసా చట్టంపై అధికారులకు అవగాహన నిర్వహించామని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ పథకం కింద కేంద్రం వందశాతం సబ్సిడీ ఇస్తున్నప్పటికి జిఎస్‌టి సమస్యతో లభ్దిదారులు చెల్లించ లేకపోతున్నారని పూర్తిగా ఉచితంగా ఇచ్చే విధంగా చూడాలని చైర్మన్‌కు తెలిపారు. ఎస్‌పి విష్ణు వారియర్ మాట్లాడుతూ కేసులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు, రాష్ట్ర డైరీ అభివృద్ధి చెర్మన్ లోక భూమారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు కుమ్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, జెసి సంధ్యారాణి, ఆర్‌డిఒలు సూర్యనారాయణ జగదీశ్వర్, డిఎస్‌పిలు, జిల్లా కమిటీ సభ్యులు, డిఎస్‌సిడిఒ అశన్న, ఈడి శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments