Home ఆదిలాబాద్ ఓటర్ల జాబితా సవరణ

ఓటర్ల జాబితా సవరణ

manatelangana logoఆదిలాబాద్ కలెక్టరేట్ : ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం స్వచ్చమైన ఓటర్ల జాబితా కోసం, ఓటరుదారుల ఆధార్ అనుసంధానం కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం విసి హాలులో వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్ల జాబితాలో, డూప్లికేట్స్, షిప్టెడ్, అనర్హతగల ఓటర్లను గుర్తించి స్థానికంగా నివాసం ఉన్న వారికి మాత్రమే ఓటర్ల జాబితా నందు చేర్చి నిజమైన వారికి ఓటు హక్కు కల్పించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు తగు సలహాలు, సూచనలు అందించి సహకరించాలని కోరారు. ఈ ప్రక్రియ ఆగస్టు 7 లోగా పూర్తిగా చేయడానికి సహాకరించాలని అన్నారు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక లక్షా 43 వేల 64 మంది ఓటరు దారులకు ఆధార్ అనుసంధానం జరిగిందని, 4877 మంది ఓటరుగా నమోదు కావలసి ఉన్నారని, 11690 మంది డూప్లికేట్స్ ఉన్నారని, 2042 మంది చనిపోయినవారు, 40920 మంది షిప్టెడ్, 727 మంది అనర్హత కలిగినవారు ఉన్నారని తెలిపారు. వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ కొంత మంది నివాసం ఉన్నవారికి కూడ నివాసం లేని నోటీసులు జారీ చేసారని, కొంతమందికి నోటీసులు జారీకాలేదని, ఆన్‌లైన్ ద్వారా నమోదులు చేసుకున్న వారికి అనుసంధానం కలేదని ఇంకా సమయం కేటాయించి పరిశీలన అనంతరం జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, రెవెన్యూ డివిజనల్ అధికారి సంజీవరెడ్డి, ఎంఆర్‌ఓ సుభాష్, ఎన్నికల పర్యవేక్షకులు ప్రభాకర్‌స్వామి వివిధ పార్టీల ప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు లోక భూమారెడ్డి, జోగు ప్రేమెందర్, కాంగ్రెస్ నాయకులు అజయ్, అశోక్, ఎంఐఎం నాయకులు పారూఖ్ అహ్మద్, సిపిఐఎం బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.