Home తాజా వార్తలు ఓసారి ప్రేమలో పడ్డా

ఓసారి ప్రేమలో పడ్డా

Reginaకొత్త జంట, రా రా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాల్లో తన గ్లామరస్ నటనతో ప్రేక్షకులను మురిపించిన బ్యూటీ రెజీనా కసాండ్రా. ప్రస్తుతం ఈ భామ నారారోహిత్ సినిమా ‘శంకర’తో పాటు సాయిధరమ్‌తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో నటిస్తోంది. ఇవేగాకుంగా గోపిచంద్, మంచు మనోజ్ సినిమాల్లో రెజీనా చేస్తోంది. ఇక ప్రేమ గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ “గతంలో నేను ఓసారి ప్రేమలో పడ్డాను. చెన్నైలో మా పొరుగింటి అబ్బాయితో తొలిసారి ప్రేమలో పడడం మరిచిపోలేనిది. అప్పుడు నేను నాలుగవ తరగతి చదువుతున్నా. ఆ రోజులు గుర్తుకువస్తే ఇప్పటికీ మధురానుభూతి కలుగుతుంది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌గా తిరిగేవాళ్లం. ఒకరి బాల్కనీలోకి ఒకరం జంప్ చేసి చేతులు పట్టుకొని నడిచేవాళ్లం. దాదాపు ఆరు సంవత్సరాల పాటు మా స్నేహం, బంధం కొనసాగింది. ఆతర్వాత అతను విదేశాలకు వెళ్లాడు”అని చెప్పింది.