Home జిల్లాలు ఓ విధి వంచిత ‘ధీన’ స్థితి

ఓ విధి వంచిత ‘ధీన’ స్థితి

2mbacp04అమ్రాబాద్: మండల పరిధిలోని చింతలోని పల్లి గ్రామానికి చెందిన పుష్పకుల శంకర్,పార్వతమ్మల రెండవ కుమార్తే అయిన ధీన(20) అదే గ్రామానికి చెందిన చింతల వందయ్య,పెద్దమ్మలకుమారుడై నరాము లు(23)గత మూడు సంవత్సరాల క్రితం ఇద్ధరు ప్రేమించుకొని మద్ది మడుగులో వివాహం చేసుకున్నారు. విరి వివాహనికి ఇద్దరి తల్లిదండ్రు లకు సమ్మత్తి లేకపోయిన రాము సొంత గ్రామంలో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తరువాత, రాము నాలుగు నెలలక్రితం ఒ రోజు మాంసం తీసుక వస్తానని అమ్రాబాదుకు వెళ్ళి మరళా రాలేదని గర్భిణీ అయిన ధీన అన్నారు.

అత్తమామలను ఆశ్రయించి వివరాలు అడగగా మళ్ళీ వ స్తాడని తనను నమ్మించారని ఆమె తెలిపారు. మరుసటి రోజు నుంచి రాము తల్లిదండ్రులు ఇంటికి తాళ్లలు వేసి వూరు వదిలి వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు. మోసపోయిన నేను అమ్రాబాద్ పోలీసుస్టేషన్‌లో గ్రా మస్థుల సహకారంతో రాము,అతని కుంటుంబ సభ్యులపై ఫిర్యాదు చే శానని ఆమె అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఐ,డి ఎస్సి,ఎస్పిల ను ఆశ్రయించానని ఆమె వాపోయింది.

పోలీసులు వెంటనే పటుకోని న్యాయం చేస్తామని చెప్పిన ఇప్పటి వర కు పట్టుకొలేక పోవడంతో భయాందోళనకు గురవుతున్ననని తల్లి కాబోయే రోజులు దగ్గరపడుతున్నాయని భోరుమంది ఇప్పటికైన ధీన బాధను అలకించి తనభర్తను వెతికి తీసుకరావలని గ్రామస్థులు కోరు తున్నారు. ధీన విషయంపై అమ్రాబాద్ సిఐ శ్రీనివాస్,ఎస్‌ఐ ఆదిరెడ్డి వివరణ అడగగా రాముకు సంబందిధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న మని అతి త్వరలో పట్టుకుంటామని వారు సష్టం చేశారు.