Home జిల్లాలు కంపు కొడుతున్న గ్రామాలు

కంపు కొడుతున్న గ్రామాలు

పడకేసిన పారిశుధం

మురికితో నిండిన గ్రామాలు
విజృంభిస్తున్న విష జ్వరాలు, రోగాలు
ప్రజలకు తప్పని అవస్థలు
పట్టించుకోని అధికారులు
02BDN210Aరెంజల్ : గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకూ పారిశుధం పడకేసి కంపుకొడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకో వడంలేదని మండల వాసులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పచ్చని వాతావరణంలా తలపించే గ్రామాలు పారిశుధం పడక వేయడంతో ఎటుచూసినా దుర్గంధం, వాసనలతో దర్శనమిస్తున్నాయి. కాలనీలలోని వార్డులలో ఎటుచూసినా చెత్తాచెదారంతో కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. మురుగి కాలువలలోని నీరు వీధులు, రోడ్లపై పారుతూ కంపు వాసనతో భరించలేని విధంగా ఏరులైపారుతున్నాయి. భరించలేని పరిస్థితులు తలపిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటికే ప్రజలు విషజ్వరాలు, వ్యాధులకు, రోగాలకు గురౌతున్నారు. సర్కారు మాత్రం నిమ్మకునిరెత్తినట్లుగా మత్తులో ఉంటుంది. గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యం గాలిలోని దీపంలాగా మారుతున్నాయి.

ఒకవైపు పంచాయతీ పారిశుద్ధ కార్మికులు సమ్మె బాటలో ఉండడంతో రోజురోజుకు గ్రామాలలో పారిశుద్ధం పడకేస్తూ కంపు గ్రామాలుగా తలపిస్తున్నాయి. రెంజల్ మండలంలో 11 గ్రామ 02BDN210Cపంచాయతీల్లో కంపు వాసనలతో కనిపిస్తున్నాయి. నెలల తరబడి నుండి మురికి కాలువలు రోడ్లపైన చెత్తచెదారాలు తొలగించకపోవడంతో పాటు వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయకపోవడంతోనే నీరు, గాలి కలుషితమై ప్రజలకు రోగాల బారిన పడుతున్నారు. మురికి కాలువల్లో చెత్తచెదారాలతో నిండిపోయి కాలనీలలో నివసించే వారి ముక్కులకు కంపు వాసన భరించలేని విధంగా వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. రాత్రి సమయంలో పడుకుంటే వాసనతో పాటు దోమల బెడదతో నిద్రలు పట్టడంలేదని రోగాలు పెరుగుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలో పలు గ్రామాలలో వాంతు, విరేచనాలు, విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభావితం అయ్యే విధంగా చోటుచేసుకుంటున్నాయి.

గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని వారు ఆందోళన చెందుతున్నారు. మురికి నీరుపై నిల్వ ఉన్న దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. నీలా గ్రామంలో గత 15, 20 రోజుల క్రితం ఓ చిన్నారి డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. మండల కేంద్రంలో మరో యువకుడికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు తెలుపగా చికిత్స కొరకు హైదరాబాద్‌కు తరలించినట్లు గ్రామస్థుల సమాచారం. వైద్య సిబ్బంది అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధంపై చర్యలను చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. రోగాల నుండి రక్షించాలంటూన్నారు. ఇప్పటికైనా సమ్మె చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం జీతాలను పెంచి వారిని విధుల్లోకి తీసుకరావాలని ప్రజలు కోరుతున్నారు.