Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కనిపించని ‘ఈ పంచాయతీ’ సేవలు

adblఆదిలాబాద్ ః గామ పంచాయతీలలో గ్రామస్థులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం ఈ పంచాయతీ సేవలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రతీ గ్రామ పంచాయతీకి కంప్యూటర్‌లను పంపిణి చేసింది. కానీ చాలా గ్రామాలలో పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పంపిణి అయిన కంప్యూటర్‌లు కొన్ని మండల కార్యాలయాల్లో, మరికొన్ని వారి ఇళ్లలోనే వృధాగా పడి ఉన్నాయి.

నియోజకవర్గంలో ఇలా…
నియోజకవర్గంలోని ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాణి, రెబ్బెన మండలాల్లో 50 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 46 పంచాయతీలకు కంప్యూటర్‌లను పంపిణి చేశారు. అయితే కొన్ని గ్రామ పంచాయతీలలో పక్కా భవనాలు లేకపోవడంతో కొన్నింటికి భవనాలు ఉన్నా సరైన రక్షణ లేకపోవడంతో చాలా మంది ఎంపిడిఓ కార్యాలయాల్లోనే కంప్యూటర్‌లను ఉంచారు. ఆసిఫాబాద్‌లో 14 గ్రామ పంచాయతీలకు ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీలో ఇదివరకు ఈ పాలన కొనసాగుతుంది. ఇటీవల మిగ13 జిపిలకు కంప్యూటర్‌లను ఎంపిడిఓ పంపిణి చేశారు. కానీ మండలంలోని తుంపల్లి, రౌటసంకెపల్లిల్లో పంచాయతీ భవనాలు లేవు. బాబాపూర్, సాలెగూడ, ఈదులవాడ, రహపెల్లి, గుండి పంచాయతీ భవనాలు శిథిలావస్థలకు చేరుకున్నాయి. దీంతో చాలా మంది కంప్యూటర్‌లను తమ ఇళ్లలోనే భద్రపర్చారు. తిర్యాణి మండల కేంద్ర పంచాయతీలో ఉన్నా మిగతా 12 పంచాయతీలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఆ కంప్యూటర్‌లను ఎంపిడిఓ కార్యాలయం భద్రపర్చారు.
ఈ సేవ పాలనతో ఇంటిపన్ను, నీటిపన్ను వివరాలు, జనణ, మరణ దృవపత్రాలు, ప్రభుత్వం నుండి మంజూరైన నిధులు, వాటి ఖర్చుల వివరాలు అన్నీ ఈ పానలలో కొనసాగుతాయి. వీటిని వెంటనే అమలు పర్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments