Home తాజా వార్తలు కరువు కమ్ముకోస్తుంది… కాలం కంటతడిపెట్టిస్తుంది

కరువు కమ్ముకోస్తుంది… కాలం కంటతడిపెట్టిస్తుంది

31armndp42.3నిజామాబాద్: ఖరీపు సీజను ప్రారంభం అయి రెండు నెలలు కావోస్తున్న వర్షాల జాడ లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయి కరువు కాటేయడానికి సిద్ధ్దంగా ఉంది. మండలంలో సాగుకు యోగ్యమైన పంటభుమి 35000 ఎకరాలు ఉంది. అందులో 21000 ఎకరాలలో వివిద పంటలు పండుతాయి. రెండు నేలలో 68.9మి.మీ వర్షం కురవాలసి ఉండగా ఇప్పటి వరకు 32.9మి.మీ నమోదు అయింది. సకాలంలో వానలు కురియక సాగు విస్తీర్ణం తగ్గింది. తోలకరి వానలకు సోయా 7,500 ఎకరాలలో 3,750 ఎకరాలలో మొక్కజోన్న, 3000 ఎకరాలలో పసుపు ,3800 ఎకరాలలో వరి పంటలను వేసారు. వానల జాడ లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి కరెంటు రోజుకు రెండు దపాలుగా ఏడు గంటలు ఇస్తున్న రెండు మడులు తడవడంలేదని రైతులు ఆందోళన చేందుతున్నారు.
ఎండుతున్న పంటలు :
తోలకరి వానలకు వేసిన సోయా,వరి,మెక్కజోన్న పంటలు ఎండిపోతున్నాయి. బ్యాంకులలో, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో తెలియడంలేదని రైతులు ఆందోళన చేందుతున్నారు. కరువు కమ్ముకోస్తున్న ప్రభుత్వం హరిత హరం, మిషన్ కాకతీయ పేరుతో కాలం వెళ్లదిస్తుందని రైతులు వాపోతున్నారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రైతుల ఆత్మహత్యలే శరణ్యమని వారు అంటున్నారు.

31armndp42.1