Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కుక్కల దాడిలో 16 గొర్రెల మృతి

31mdcgtp01మెదక్: కుక్కల దాడిలో 16 గొర్రెల మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి రోజు లాగే గురువారం రోజు సాయంత్రం కుర్మ బీరవ్వ కు చెందిన గొర్రెలు దొడ్డి (కొట్టం) లో తొలించి ఇంటికి వెళ్లగా ఉదయం వెల్లి చూడగా కొట్టంలో సుమారు 16 గొర్రెలు మృతి చెంది పడిపోగా కొన్ని తీవ్రగాయాలతో కనిపించాయి. కుక్కల దాడిలో బీరవ్వకు చెందిన 16 గొర్రెలు ఇక్క సారి మృతి చెందగా సుమారు 1 లక్ష రూపాయలు నష్టపోయినట్లు తెలిపారు. గతంలో కూడా కుక్కలు కరిచి 20 గొర్రెల వరకు మృతి చెందినట్లు తెలిపారు.

Comments

comments