Search
Friday 21 September 2018
  • :
  • :

కొత్త పిడి రాకతో డ్వామా గాడిలో పడేనా?

అస్తవ్యస్తంగా ఇజిఎస్ పనులు
ఆరోపణల పర్వంలో హరిత హారం
లక్షానికి దూరంగా ఇందిర జల ప్రభ
31mdsrdp11సంగారెడ్డి/మన తెలంగాణ : కొద్ది రోజులుగా గాడి తప్పిన డ్వామా ఇప్పటికైనా గాడిలో పడుతుందా? పేద వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాలు ఇప్పుడైనా ఊపందుకుం టాయా? అన్న చర్చ జరుగుతోంది. డ్వామా పిడి గా సురేందర్ కరణ్ బాధ్యతలు స్వీకరించడంతో ఆ శాఖ సిబ్బందితో పాటు ఇజిఎస్, ఇందిర జలప్రభ, హరితహారం తదితర పథకాలపై ఆసక్తి కలిగిన వారంతా చర్చించుకుంటున్నారు. సురేందర్ కరణ్ రెవెన్యూశాఖకు చెందిన వ్యక్తి కావడంతో డ్వామాలో ప్రక్షాళన ఖాయమని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇజిఎస్ సిబ్బంది సమ్మె చేశారు. దీంతో ఉపాధి హామీ పథకం గాడి తప్పింది. అంతే కాకుండా కొద్ది వారాలుగా ఇజిఎస్ చెల్లింపులు నిలిచిపోయాయి.

ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. సిబ్బంది సమ్మెతో ఈ పథకం మొత్తం అస్తవ్య స్తంగా మారింది. ఇక హరిత హారం కార్యక్రమంలో లక్షలాది మొక్కలు ఎండిపోయాయని, నిధులు దుర్వినియో గమయ్యాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వానలు రాకపోవడం తో ప్రస్తుతానికి ఈ ఆరోపణల వేడి చల్లారింది. లేకుంటే ఈ నిధుల దుర్వినియోగంపై రచ్చ జరిగేదే. ఇప్పటికే జడ్‌పి సమావేశాల్లో విపక్షాలు ఈ అంశంపై ఆరోపణలు చేశాయి. ఈ కారణంగా హరిత హారం వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిన అవసరముంది. ఇక ఈ ఆరోపణల కారణంగానే ఇక్కడ పిడిగా ఉన్న రవీందర్ హైదరాబాద్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జడ్‌పి సిఇఓ మధు ఇన్‌చార్జి పిడిగా అదనపు బాధ్యతలు నిర్వ హిస్తున్నారు.

అయితే ఆయన స్థానంలో హైదరాబాద్‌లో ఉన్న సురేందర్‌క రణ్‌ను ప్రభుత్వం పిడిగా నియమించింది. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సురేందర్ కరణ్ ఇక్కడ ఆర్‌విఎం పిఓగా పని చేశారు. ఆ తర్వాత ఆయన వరంగల్ డిఆర్‌ఓగా వెళ్లారు. మళ్లీ ఇదే జిల్లాకు రావడం చర్చనీయాంశమైంది. జిల్లాలో అసలే కరువు ఛాయలు అలుముకున్నాయి. ఈసమయంలో ఇజిఎస్ పనులను ముమ్మరంగా చేయా ల్సి ఉంటుంది. ఇక ఇందిర జల ప్రభ పనులు కూడా వేగవంతం చేయాలి. లేకుంటే ప్రభుత్వ నిర్దేశించిన లక్షం నెరవేరడం కష్టం. దళిత రైతుల భూముల్లో పంటలు పండించడం మరింత కష్టం. జిల్లాలో అత్యంత కీలకమైన శాఖలో ఒకటిగా ఉన్న డ్వామా ఇప్పటికైనా గాడిలో పడితేనే ఆ శాఖ పరిధిలోని పథకాల లక్షాలు నెరవేరుతాయి.

Comments

comments