Search
Saturday 17 November 2018
  • :
  • :

క్లీన్‌షేవ్‌తో పవన్ న్యూలుక్

Bobby, pawan kalyanరవితేజ ‘పవర్’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు బాబీ ఆ వెంటనే పవన్‌కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. చాలా గ్యాప్ తీసుకొని ‘సర్దార్’ టైటిల్‌తో పవన్ చేస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే వార్తల్లో నిలుస్తూ వచ్చింది. శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో పవన్ చరిష్మా పెద్దగా కనిపించలేదు. ఈమధ్యే మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పవన్‌కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో చేరిపోవడంతో సినిమా ఊపందుకుంది. ఇక శనివారం తన బర్త్‌డేను జరుపుకుంటున్న దర్శకుడు బాబీ ఉదయం ‘సర్దార్’ సెట్లో సరదాగా పవన్‌కళ్యాణ్‌తో ఓ ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పవన్‌కళ్యాణ్ దగ్గరి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని బాబీ ఈ సందర్భంగా తెలిపారు. గత కొంతకాలం వరకూ గడ్డంతో కనపడిన పవన్ ఈ ఫొటోలో క్లీన్ షేవ్‌లో దర్శనమివ్వడం ఆసక్తికర అంశం. ఈ సినిమా కోసం పవన్‌కళ్యాణ్ న్యూ లుక్ అభిమానులను అలరించనుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బిగ్ హిట్‌గా నిలవడం ఖాయమంటున్నారు ఫిల్మ్‌మేకర్స్.

Comments

comments