Search
Friday 16 November 2018
  • :
  • :

గాంధీ ఆసుపత్రిలో 9 నెలల పాప అపహరణ

సిసి కెమెరాల ఏర్పాటుపై నీలినీడలు

gandhiసికింద్రాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆ సుపత్రిలో తొమ్మిది నెలల చిన్నారి అవ హరణకు గురైన ఘటన కలకలం రేపిం ది. ఒడిలో ఉన్న చిన్నారిని గుర్తుతెలియ ని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో ఆసుపత్రిలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా గౌలపల్లి గ్రామానికి చెందిన రేణుక, రమేష్ దంపతులు. వీరికి తొమ్మి ది నెలల కావ్య అనే కూతురు ఉంది. వీరు వైద్యం కోసం శుక్రవారం గాంధీ ఆసుపత్రికి వచ్చారు.

వారికి సంబంధించిన డాక్టర్లు లేకపోవడంతో మళ్లీ వెళ్లి రావడం ఎందుకని ఆసుపత్రిలోనే ఉండి శనివారం ఉదయం ఓపిలో చూపించుకుని వెళ్దామని అనుకున్నారు. రాత్రి ఆసుపత్రి ఆవరణలో రమేష్, రేణుక దంపతులు కుతూరుతో కలసి ఉన్నారు. క్యాజువాలిటీ వార్డు ఎదురుగా ఖాళీ స్థలం ఉండటంతో అక్కడే పడుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిలో ఓ గుర్తుతెలియని మహిళ అర్థరాత్రి రేణుక దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టింది.

ఎప్పటికీ ఆమె వెళ్లకపోవడంతో రేణుక మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది. ఒడిలో తన కూతురు కావ్య కూడా ఉంది. ఉదయం తెల్లవారు జామున లేచిన రేణుకకు తన ఒడిలో ఉన్న బిడ్డ కనిపించలేదు. ఆందోళన చెందిన రేణుక తన బిడ్డ గురించి ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. తనతో రాత్రి మాట్లాడిన మహిళనే తన కుతూరును ఎత్తుకెళ్లి ఉంటుందని భావించిన రేణుక చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రక్షణలేని ‘గాంధీ’
గతంలో గాంధీ ఆసుపత్రిలో పిల్లల అపహరణకు సంబంధించి పలు సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే సిసి కెమేరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సంవత్సరాలు గడిచినా గాంధీ ఆసుప్రతి అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. గతంలో తూతూమంత్రంగా ఏర్పాటు చేసిన సిసి కెమేరాలు పని చెయ్యకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వార్డుల వారీగా జరుగుతున్న పరిణామాలు, గాంధీ ఆసుపత్రిలో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునేలా సిసి కెమేరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్షంగా వ్యహరించడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతునే ఉన్నాయి.

నిత్యం వేలాది మంది సంచరించే ఆసుపత్రి ఆవరణలో పిల్లల అపహరణ, రోగుల బంగారు ఆభరణాల దొంగతనాలు, పురిటిలో పుట్టిన పసిగుడ్డులను ఎత్తుకెళ్లడం, నకిలీ డాక్టర్ల సంచారం వంటివి పరిపాటిగా మారడం ప్రజలను ఆందోళన కలిగిస్తున్నది. ఆసుపత్రిలో గతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నామని బీరాలు పలికిన అధికారులు మరోసారి ఇలాంటి సంఘటనలు జరగడంతో హంగామా చేయడం తప్ప చేసేది లేక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. గాంధీ ఆసుపత్రిలో సిసి కెమేరాలు ఏర్పాటు చేసి ఉంటే తొమ్మిది నెలల పాపను ఎత్తుకెళ్లింది ఎవరనేది తెలిసి ఉండేదని పలువురు భావిస్తున్నారు.

Comments

comments