హైదరాబాద్ : ఎల్బి స్టేడియంలో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించలేదు. ఆరు వేల మందితో తంగేడు పువ్వులా నిలబడటం, ఒకేసారి బతుకమ్మలను పేర్చడం ద్వారా గిన్నిస్‌లో స్థానం సంపాదించాలని తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రయత్నాలు చేసింది. వర్షం కారణంగా ఈ కార్యక్రమం పూర్తి కాకముందే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తంగేడు పువ్వుల ఆకారంలో నిలబడేందుకు సరిపోను మహిళలు లేకపోవడంతో గిన్నిస్‌లో స్థానం సంపాదించలేకపోయింది. బతుకమ్మలు పేర్చడంలో సమన్వయం లోపం కారణంగానే గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.