Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గొర్రెల పంపిణీపై సామాజిక తనిఖీ చేపట్టాలి

sheep who have died, they will not be able to get insurance

మృతి చెందిన గొర్రెలకు బీమా పరిహారంలో జాప్యమెందుకు ?
రూ.5200 వెచ్చించి కొనుగోలు చేసిన గొర్రెకు నేడు రూ.3 వేలు
మనతెలంగాణ కథనంపై స్పందించిన ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి

మనతెలంగాణ కథనంపై స్పందించిన ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి

మనతెలంగాణ/జగిత్యాల: పంపిణీపై అధికారులు క్షేత్ర స్థాయిలో సామాజిక తనిఖీచేపట్టి అవినీతి, అక్రమాలను వెలికితీయాలని జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి అన్నారు. రాయితీ గొర్రెలకు “బీమా వర్తించేదెప్పుడో” అనే శీర్షికతో బుధవారం మనతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై జీవన్‌రెడ్డి స్పందించారు.బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలకు 75 శాతం రాయితీపై గొర్రెలు అందించడం హర్షనీయమని, అయితే గొర్రెలను పంపి ణీ చేసిన ప్రభుత్వం వాటి అభివృద్ది కోసం తీసుకున్న చర్యలు నామమాత్రమేనన్నారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల సకాలంలో వైద్య సేవలందక చాల వరకు గొర్రెలు మృత్యువాతపడుతున్నాయన్నారు. ఒక్కో గొర్రెల యూనిట్‌కు రూ.3830 బీమా ప్రీమియంగా చెల్లించారని, గొర్రెల యూనిట్లలో చనిపోయిన గొర్రెలకు బీమా పరిహారం మంజూరు చేసి వాటి స్థానంలో కొత్తగా గొర్రెలను అందించాల్సి ఉండగా అధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదని ఆ రోపించారు.ఇప్పటి వరకు జిల్లాలో పంపిణీ చేసిన గొర్రెల్లో ఎన్ని బతికున్నాయి…
ఎన్ని పిల్లలు పుట్టాయనే విషయమై సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు.తనిఖీ చేయడం వల్ల లబ్దిదారులకు ఎంత మేరకు లాభం వచ్చింది.. ఏమైనా నష్టం జరిగిందా అనే విషయాలు వెల్లడవుతాయన్నారు. సామాజిక తనిఖీలో వెలుగు చూసిన అంశాలను బట్టి రెండో విడతలో పం పిణీలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ను ంచి రాయితీపై గొల్ల, కుర్మలు గొర్రెలను పొందినా వాటి వల్ల లబ్ధిదారులు పూర్తి స్థాయిలో లబ్ది చేకూరడం లేదన్నారు. ప్రభుత్వం ఒక గొర్రె ధర రూ.5200గా నిర్ణయించి అందజేయగా ప్రస్తు తం ఆ గొర్రె ధర రూ.3 నుంచి 4 వేలకు మించి పలకడం లేదన్నారు గొర్రెలు పొందిన లబ్దిదారులు బిసి కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు వెసులుబాటు కల్పించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.

Comments

comments