Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర

2mbn20మహబూబ్‌నగర్: గ్రామ అభివృద్ధిలో సర్పం చ్‌లదే కీలక పాత్ర అని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బృందావన్ గార్డెన్‌లో జిల్లా సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచుల ద్వితీయ వార్షికోత్సవ సదస్సుకు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరి రేమాండ్ పీటర్, పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంరద్రన్, జిల్లా కలెక్టర్ టికె. శ్రీదేవి, ఎస్‌పి విశ్వప్రసాద్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. నీతి, నిజాయితీ పెట్టుబడిగా పని చేయాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే గ్రామ జ్యోతి పథకం ద్వారా గ్రామాల్లో అన్ని రకాల మౌళిక సౌకర్యాలు సమకూరుతాయని తెలిపారు.

తాను గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉందని, సర్పంచుకుల ఉండే ఇబ్బందులు తనకు తెలుసన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరాదని, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఉండరాదని తెలిపారు. నిబంధనలను కచ్ఛితంగా పాటిస్తేనే నాయకులకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కలెక్టర్ టికె. శ్రీదేవి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్య మన్నారు. నిర్మల్ గ్రామీణ పురస్కారం పొందిన బొంరాస్‌పేట, దూద్‌కల్ సర్పంచులను గ్రామ పంచాయతీ అవార్డులను సాధించిన కిషణ్‌నగర్, హాజీపల్లి సర్పంచులను ప్రత్యేకంగా అభినందించారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలను ప్రోత్సహించాలని, ఈ దిశగా అవగాహన కల్పించాలన్నారు.

గ్రామాలను అభివృద్దిలో విశేషంగా కృషి చేసిన వారికి సత్కరిస్తామన్నారు. ఎస్‌పి శివప్రసాద్ మాట్లాడుతూ తన గ్రామం అంటే నాకు ప్రాణమని, నాటి గ్రామాలు వ్యవసాయం, పశుపోషణ, జలకళతో చెరువులు ఉండేవని, పండుగలు, పర్వదినాలలో గ్రామస్థులందరూ కలిసి పాల్పంచుకునేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ నేటి గ్రామాలు జలకళ కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే ప్రతి ఒక్కరు గ్రామాభివృద్ధికి చేయూతనివ్వాలని తెలిపారు.

Comments

comments