Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలపై పూర్తిస్థాయి శిక్షణ

CASH

వికారాబాద్ జిల్లా : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్త్రీ నిధి ద్వారా గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నగదు లావాదేవీల నిర్వాహణ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఈ వ్యాలెట్, ఎస్‌బిఐ బ.డ్డీ స్టార్ 99 ఆష్ పై స్త్రీ నిధి విస్తృత ప్రాచుర్యం నిర్వహించాలన్నారు. పిఒఎస్ మిషన్ వాడకంపై త్వరలో శిక్షణ ఇస్తామన్నారు. బ్యాంకు ఖాతాల ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌తో సంబంధం లేకుండా యుటిఐ ద్వారా నేరుగా నగదు లావాదేవీలు జరుపవచ్చన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామాల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం కోసం బ్రూస్టర్‌ను ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికా రులకు సూచించారు. బ్యాంకు ఖాతా లేని వారు వెంటనే ఖాతాలు తెరవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానించబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూ, డిఆర్‌డిఓ జాన్సన్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

Comments

comments