Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

జిన్సన్ జిగేల్

Gold medal is Jinson Johnson in men's 1500m

పరుగు పందెంలో  స్వర్ణపతకం

జకార్తా: ఆసియా క్రీడల్లో గురువారం అథ్లెటిక్స్ 1500 మీ. పురుషుల పరుగు పందెంలో కేరళ  కొజికోడ్ జిల్లాకు చెందిన చక్కిత్తపడ గ్రామానికి చెందిన జిన్‌సన్ జాన్సన్ అత్యంత వేగంగా పరుగెత్తి, మిగతా రన్నర్స్‌ను చివర్లో అధిగమించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.  దీంతో ఆసియాడ్‌లో భారత్ గెలుచుకున్న స్వర్ణాల సంఖ్య 12కు చేరింది. అంతేకాక 20 రజత పతకాలు, 23 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానానికి ఎగబాకింది. ఇదివరకు  800 మీ. పరుగులో విజేత మంజిత్ సింగ్ కంటే వెనుకబడి రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకున్న అతడు ఇప్పుడు ఏకంగా 1500 మీ. టైమింగ్‌తో ఇరాన్‌కు చెందిన అమీర్ మొరాది(3.45.62 నిమిషాలు)ని అధిగమించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. బహ్రెయిన్‌కు చెందిన మహమ్మద్ తియోలీ( 3.45.88 నిమిషాలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.  ఈ సీజన్‌లో ఇదే జాన్సన్ అత్యుత్తమ రికార్డు.  3 నిమిషాల 44.72 సెకండ్లలో గెలుపు పోస్ట్‌ను దాటి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.  800 మీ. పరుగును  మంజిత్ సింగ్ 1.46.15 నిమిషాల్లో  పూర్తిచేసి స్వర్ణం దక్కించుకోగా, జాన్సన్ 1.46.35 నిమిషాల్లో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఖతార్‌కు చెందిన అబ్దుల్లా అబూబకర్ 1.46.38 నిమిషాల్లో పూర్తిచేసి  కాంస్య పతకాన్ని దకించుకున్నాడు. కాగా మంజిత్ (3.46.57 నిమిషాలు) నాలుగో స్థానంలో నిలిచాడు. తనకు ఏమాత్రం పోటీరాడనుకున్న జిన్‌సన్ జాన్సన్ చిట్టచివర్లో వేగం పుంజుకుని మంజిత్‌ను కంగుతినిపించాడు. జాన్సన్‌కు భారత సైనిక కోచ్ అమ్రీశ్ కుమార్ శిక్షణ ఇచ్చాడు.

Comments

comments