Home తాజా వార్తలు తలసాని రాజీనామాను ఆమోదించండి : మర్రి

తలసాని రాజీనామాను ఆమోదించండి : మర్రి

marri_manatelanganaహైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మర్రి శశిధర్‌రెడ్డి స్పీకర్ మధుసూదనాచారిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఒకపార్టీ తరపున గెలిచి, మరో పార్టీలోకి ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. తలసానికి మంత్రి పదవిలో కొనసాగే హక్కులేదని ఆయన అన్నారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలని తలసానిని డిమాండ్ చేశారు.