Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

తల్లిపాలు పిల్లలకు సర్వరోగ నివారిణిలా పనిచేస్తాయి

06 cpl 0106 CPL 01 (jagan)నల్లగొండః తల్లిపాలు పిల్లలకు సర్వరోగ నివారిణిలా పనిచేస్తాయని వైస్ ఎంపిపి కాయితి రమేష్‌గౌడ్ అన్నారు. మండలంలోని పెద్దకొండూరు అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిపాలను పసిపిల్లలకు త్రాగించడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ వారికి అవగాహన కల్పించారు. ప్రసవం జరిగిన గంటలోపు తల్లి దగ్గర లభించే ముర్రుపాలు పిల్లలకు తప్పకుండా త్రాగించాలని సూచించారు. దాంతో భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు రాకుండా నివారించే అవకాశముందన్నారు. కొందరు తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల బలహీన పడతామని, శరీర సౌందర్యం దెబ్బ తింటుందని భావించి డబ్బా పాలను త్రాగించడం జరుగుతుందన్నారు. కానీ అలా చేయడం వల్ల పిల్లల శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి వ్యాధులు సులువుగా వ్యాపించే ప్రమాదముందన్నారు. అందుకే పసిపిలల్లకు తూచతప్పకండా తల్లిపాలను త్రాగించాలని కోరారు. అంతకుముందు గ్రామంలో తల్లిపాల వారోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సువర్ణ నీళ్ల విరేచనాలను అరికట్టేందుకు అవసరమైన ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎం సిహెచ్. యాదమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు కె.అలివేలు, హెచ్.మమత, ఎన్.రజిత, ఆశావర్కర్ వై.లావణ్య, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు.

Comments

comments