Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

తహసిల్దార్‌కు బాధిత రైతుల ఫిర్యాదు

6 బోగస్ టైటిల్లు పట్టివేత

అక్రమార్కులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
బ్యాంకు, రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు
మన తెలంగాణ కథనాలతో కదిలిన యంత్రాంగం

Telangana_Govt_Logo_manatelanganaకుభీర్: మండల కేంద్రమైన కుభీర్‌లోని యూనియన్ బ్యాంకు ద్వారా బోగస్ టైటిల్ పుస్తకాలు సృష్టించి రైతులకు తెలియకుండా రుణాలు లేపుకున్న కుంభకోణం వెలుగుచూడడంతో బాధిత రైతులు అఖిలపక్షం రాజకీయ నాయకులతోపాటు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ చందప్రకాష్ వర్మకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో అక్రమార్కులను అరెస్టుచేసి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కలెక్టర్, ఆర్‌డిఓ, ఎస్‌పి, డిఎస్‌పిలకు ఫిర్యాదు కాపీని పంపించారు.

బాధిత రైతుల్లో కె జలప్ప, కె భోజారం, కె గంగాధర్, శెరే భోజన్న తదితరులు ఉన్నారు. వీరి సర్వె నంబర్‌లపై భోగస్ టైటిల్లను సృష్టించి హల్దా, పల్సి, కుభీర్ వాసుల ఫోటోలను పెట్టి రుణాలు లేపుకున్నారు. ఇందులో కొన్ని సంతకాలు ఫోర్జరివీ, స్టాంపులు తయారు చేసుకొని తహసిల్దార్, ఆర్‌డిఓవి ముద్రలు వేశారు. గత నెల 30న బ్యాంకు మేనెజర్ తహసిల్దార్‌కు భోగస్ టైటిల్లను చూయించి మౌఖికంగా ఫిర్యాదు చేసినప్పటికి ఇది పత్రికల ద్వారా వెలుగు చూసే వరకు తహసిల్దార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా బ్యాంకు మేనజర్ సైతం లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంలో తాత్సారం చేశారు.

దీంతో టైటిల్ బుక్కులు, పహానిలు ఎక్కడి నుంచి వచ్చాయి, బ్యాంకు అధికారులు ఏదైనా రైతు రుణానికై వెలితే ఆ సర్విఫికేటు, ఈ సర్టిఫికేట్, ఇక్కడ సంతకం, అక్కడ సంతకం అంటు సతాయించే అధికారులు అక్రమార్కులు ఏ విధంగా రుణాలు ఇచ్చారోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందిచి సమగ్ర విచారణ జరిపించి దోశులను కఠినంగా శిక్షించాలని బాదిత రైతులు కోరుతున్నారు. రైతులకు అండగా అఖిలపక్షం నాయకుడు మాజీ మండల అధ్యక్షుడు బోయిడి విఠ్ఠల్, సర్పంచ్ జి బాబు, ఆలయ కమిటి అధ్య క్షులు బంక బాబు, నాయకులు అనిల్, విజయ్, కె సాయినాథ్, కె దత్తాత్రి,రాందాస్, పీరాజీ తదితరులు ఉన్నారు.

Comments

comments