Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

తాళాలు ఉన్న ఇళ్లే టార్గెట్

Targeted house with locks

రాయికల్‌: మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యవంగా చేసుకొని చోరికి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చొరబడ్డ దుండగులు రూ. 53 వేల నగదుతో పాటు ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల రూరల్ సిఐ రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఐ కరుణాకర్ చోరికి గురైన ఇళ్లను పరిశీలించారు. ఆనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ముక్కెర రాజు డబ్బులు ఉన్న గదికి తాళం వేసి ప్రక్క గదిలో నిద్రించగా దుండగులు రాజు నిద్రిస్తున్న గదికి బయట గొలుసు పెట్టి తాళం వేసి మరో గది తాళం పగులగొట్టి రూ.25 వేల నగదును ఎత్తుకెళ్లారు. గదిలోని వస్తువులను చిందరవందర చేసారు. అలాగే పడిగెల మల్లారెడ్డి ఇంట్లో చొరబడ్డ దొంగలకు అక్కడ ఏలాంటి వస్తువులు దొరకకపోవడంతో సమీపంలోని గడికొప్పుల మల్లేష్ ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డారు. రూ.18 వేల నగదు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారని అలాగే నాయిని రాజశేఖర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు రాజశేఖర్ కుటుంబ సభ్యులు వేరే గ్రామానికి వెళ్లడంతో ఇంట్లో ఏ వస్తువులు పోయాయే తెలియడం లేదు. చోరి జరిగిన విషయాన్ని పోలీసులు రాజశేఖర్ కుటుంబికులకు అందజేశారు. సింగిల్ విండో భవనంలో చొరబడిన దుండగులు అక్కడ బీరువను పగులగొట్టి రూ.10 వేల నగదును కాజేసారు. కాగా గ్రామంలోని సిసి ఫుటేజీలను సిఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరి జరిగిన ఇండ్లు, సింగిల్‌ విండో భవనాన్ని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. ఈ చోరి సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ కరుణాకర్ తెలిపారు.

Comments

comments