Search
Friday 21 September 2018
  • :
  • :

దాతల ద్వారా ‘మా’ ఆర్థిక సాయం

Maaమాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంను రియల్ హీరోగా అభివర్ణిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివాజీరాజా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ‘మా’ కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటాన్ని ఆవిష్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నటి శ్రీమతి పావలా శ్యామలకు దాతలు యం.శ్రీనివాస్‌బాబు, గార్లపాటి జితేంద్రకుమార్‌ల ద్వారా 28 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ‘మా’ మూలధనంనుండే కాకుండా దాతల ద్వారా సేకరించిన విరాళాలతో 32మంది సినీ కళాకారులకు ఆర్థిక సహాయం అందజేశామని శివాజీరాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్, శివకృష్ణ, శశాంక, రఘుబాబు, ఏడిద శ్రీరాం, పి.శ్రీనివాసులు హాజరయ్యారు.

Comments

comments