Search
Friday 21 September 2018
  • :
  • :

నిర్మాతగా మారనంటున్న దీపిక

deepikaదీపముండగానే ఇల్లు చక్కదిద్దుకుంటారు కొందరు హీరోయిన్లు. సినిమాల్లో కథానాయికగా రాణిస్తున్న సమయంలో అదనపు సంపాదన కోసం వెతుకుతుంటారు. అదే యాడ్స్‌లో నటించడం… షాప్ ఓపెనింగ్స్… లైవ్ ఈవెంట్స్ ఇలా ఒకటేమిటి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే మార్గాలు హీరోయిన్లకు చాలానే ఉన్నాయి. ఈమధ్యన హీరోయిన్లు నిర్మాతలుగా కూడా మారి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘ఎన్‌హెచ్ 10’ సినిమాతో నిర్మాతగా మారి బాగా సొమ్ము చేసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. అలాగే ప్రియాంక చోప్రా కూడా నిర్మాతగా మారి ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది.
ఇలా కొలీగ్స్ అంతా ప్రొడ్యూసర్‌గా మారి సంపాదిస్తుంటే పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకునే మాత్రం ఆ పని చేయనంటోంది. ప్రస్తుతం తమాషా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో నటిస్తున్న దీపిక నిర్మాతగా మాత్రం మారదట. “ప్రొడ్యూసర్ జాబ్ అనేది చాలా కష్టమైన పని. బోలెడంత పెట్టుబడి పెట్టాలి. సినిమాకు కొబ్బరి కాయ కొట్టిన దగ్గర నుంచి విడుదలయ్యే వరకు పని ఉంటుంది. నా ఒంటి ఆ టెన్షన్ పడదు”అని చెబుతోంది దీపికాపదుకునే. కావాలంటే లైన్ ప్రొడ్యూసర్‌గా తన టాలెంట్‌ను చూపిస్తానంటోంది ఈ బ్యూటీ. అవసరమైతే సెక్రటరీ జాబ్ అయినా చేస్తాకానీ ప్రొడ్యూసర్‌గా మాత్రం చస్తే చేయనని స్పష్టంచేసింది ఈ అమ్మడు. ఈ మాటలు విన్న సినీ జనాలు ఇప్పుడు ఇలానే అంటుంది… కానీ ఏదో రోజు బ్యానర్ ప్రారంభించి తను కూడా సినిమాను నిర్మించడం ఖాయమంటున్నారు.

Comments

comments