Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నీరులేక ఎండిపోయిన చెరువులు

అడుగంటిన భూగర్భజలాలు
పంటలకు నీరు అందడం ప్రశ్నార్ధకమే

31adadb25p1ఆదిలాబాద్: ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం మరో వైపు చెరువుల ఎండిపోవ డంతో భూగర్భ జలం రోజురోజుకు అడుగంటి పోతుంది. గత ఏడాది సీజన్ ప్రారంభంతో వర్షాభావ పరిస్థితుల ఏర్పడగా ఈ ఏడాది అందుకు భిన్నంగా తొలకరి వర్షాలతో పులక రించిన రైతులు పెద్ద ఎత్తున సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే ఆ పిదప వరణుడు మొఖం చాటేయడంతో ప్రతి నిత్యం వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురిం చింది. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పంటలకు కొంత మేలు జరిగినప్పటికీ చెరువుల్లోకి చుక్క నీరు వచ్చి చేరకపోవడంతో అవి ఎండమావులను తలపిస్తున్నాయి.

ఇప్పటి వరకు గత రెండు నెలల్లో పడవాల్సిన వర్షాల కంటే 16 శాతం తక్కువగా నమోదైంది. జలా శాయాల్లో కూడా నీటి మట్టాలు అడుగంటు తుండడంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఎగువ ప్రాంతాలైన మహా రాష్ట్రలో అనుకూల స్థాయిలో వర్షాలు లేకపోవ డంతో ప్రాజెక్టులు నిండే పరిస్థితి కనుబడటం లేదు. ఇప్పటికే పచ్చని పైర్లతో పంటలు కళకళ లాడుతుండగా మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే వేసిన పంటలు ఎండి పోయే ప్రమాదం ఉందంటున్నారు. జిల్లాలో 3600 పైగా చెరువులు ఉన్నాయి. అయితే మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా 600పైగా చెరువులను పూడిక తీయడంతో పాటు మరమ్మత్తులు చేశారు.

పూడిక తీసని చెరువుల కింద 10000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు అడుగంటాయి. జూన్‌లో వర్షాలు కురిసినప్పటికీ అవి భూమిలో ఇంకి పోయాయి. చెరువుల్లో నీటి మట్టం ఎక్కడా పెరగలేదు. దీంతో చెరువుల కింద ఉన్న భూముల్లో ఈ ఏడాది పంటలు వేసే అవకాశం కనబడడం లేదంటున్నారు.
16 మండలాల్లో లోటు వర్షపాతం ..
జిల్లాలో 52 మండలాలు ఉండగా 32 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్ష పాతం నమోదు కాగా 6 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిర్మల్ డివిజన్‌లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఆ డివిజన్‌లో 13 మండలాల్లో చెరువులు నిండక బోసిపోతు న్నాయి. ఆసిఫాబాద్ డివిజన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్, మంచిర్యాల్ డివిజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్షం. ఉట్నూర్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది.
బీళ్ళుగా మారుతున్న భూములు …
కోట్లాది రూపాయలు వెచ్చించి చెరువులను పునరుద్ధరించినప్పటికీ వరుణిడి శాపంతో చెరువుల కింద ఉన్న సాగు భూములు నిరుప యోగంగా మారాయి. జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. సాగు నీటి వనరులున్న ప్రాంతాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తుండగా చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో ఖరీఫ్ ఖాళీయేనన్న ఆందోళన వారిలో నెలకొంది.

Comments

comments