Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నీరు ఎక్కదాయే.. దప్పిక తీరదాయే..

02adsrp07p2సిర్పూర్(యు): ప్రతి వర్షాకాలం మొదలు ఎండా కాలం దాకా.. అంటే మూడు కాలాల పాటు గిరిజ న ప్రాంతంలో ప్రబలే వ్యాధులకు ప్రధాన కారణం కలుషిత నీరేనని భావించిన అప్పటి ప్రభుత్వం ఎలాగైనా గిరి సీమకు ఆడ ప్రాజెక్టు ద్వారా ఫిల్టర్ నీరు అందించాలని భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినప్పటికి ప్రారంభానికి ముందే ఆటంకాలు ఎదురవుతున్నాయి. సుదీర్ఘ నిర్మాణ ప్రక్రియ అనంతరం నీటి సరఫరా టెస్ట్ ట్రయల్న్‌క్రు ఆ సంస్థ శ్రీకారం చుట్టగా జిల్లాలోని అత్యంత ఎత్తు ప్రాంతమైన కెరమెరి గుట్టల్లో నీటి సరఫరాకు టెక్నికల్ సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ గుట్టల పై నుంచే ఏజెన్సీకి నీటి సరఫరా ఆడ ప్రాజెక్టు ద్వారా ఫిల్టర్ నీరు చేయాల్సి ఉంది.సుదీర్ఘ నిర్మాణ ప్రక్రియ అనంతరం నీటి సరఫరా టెస్ట్ ట్రయల్న్‌క్రు ఆ సంస్థ శ్రీకారం చుట్టగా జిల్లాలోని అత్యంత ఎత్తు ప్రాంతమైన కెరమెరి గుట్టల్లో నీటి సరఫరాకు టెక్నికల్ సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గుట్టల పై నుంచే ఏజెన్సీకి నీటి సరఫరా ఆడ ప్రాజెక్టు ద్వారా ఫిల్టర్ నీరు చేయాల్సి ఉంది. అందులో ప్రతి యేట రోగాల బారిన పడే హైరిస్క్ ప్రాంతంగా సిర్పూర్-యు మండలాన్ని ప్రభుత్వం గుర్తించింది. అయితే ప్రాజెక్టు మంజూరై నిర్మాణ పనులు గత ఐదేళ్ళుగా కొనసాగు తుండగా అన్ని మండలాల్లో పైప్‌లైన్ వేసినప్పటికి సిర్పూర్-యు మండలానికి మాత్రం కనీసం పైప్‌లైన్ జాడ కూడాలేదు.

ఆడ ప్రాజెక్టు ద్వారా అసలు నీటి సరఫరా ఉంటుందా లేదా అని సంసయంగా మారింది. నీటి సరఫరా ప్రక్రియ తదితర లోటు పాట్లపై మన తెలంగాణ శనివారం పర్యటించి సమాచారాన్ని సేకరించింది. ఏజెన్సీలోని ఐదు మండలాలకు ఈ భారీ ప్రాజెక్టు ద్వారా మంచి నీటిని అందించాలనేది ప్రభుత్వం లక్షం కాగా ఇందు కోసం ముచ్చటగా ఐదేళ్ళపైనే పట్టింది. తీరా నీరు ఎగువనున్న మండలాలకు ఎక్కక పోగా నీటి వత్తిడికి పైపులు పగిలిపోయి నీరు రిటర్న్‌పోతున్నట్లు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అన్ని మండలాలకు పైప్‌లైన్ వేసిన అధికారులు హైరిస్క్ ప్రాంతంగా గుర్తించిన సిర్పూర్-యు మండలానికి మాత్రం ఆ సంస్థ నీటి సరఫరాకు పైప్‌లైన్ వేయక పోవడం అనుమానాలకు తావిస్తోంది.
50కిలో మీటర్ల ప్రయాణం
మండలానికి నీరందాలంటే ఆడ ప్రాజెక్టు ద్వారా ఫిల్టర్ నీళ్ళు 50 కిలో మీటర్ల నీటి ప్రయాణం చేయాల్సిందే.. గుట్టలు, కొండలు దాటి మండలానికి నీళ్ళు చేరాలంటే ఆదిలోనే అనేక ఇక్కట్లు ఎదురవుతుండటంతో ఈ యేడాది కూడా నీటి సరఫరా లేనట్లేనని అంటున్నారు. ఒక వైపు రోగాల బారిన పడటానికి ప్రధానకారణం సురక్షిత నీరు లేక పోవడమేనని గుర్తించిన యంత్రాంగం నిర్మాణ ప్రక్రియకు ఐదేళ్లు గడువగా ఇంత వరకు కోట్లాది రూపాయలు పెట్టి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నీళ్ళు దరి చేరక పోవడం నిరాశకు గురవుతున్నారు. ఈ దిశగా అధికారులు చర్యలు అంతంతమాత్రంగానే తీసుకుం టున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జైనూర్ నుంచి మండలంలోని అన్ని ప్రధాన రూట్లలో మెయిన్ పైప్‌వేయాల్సి ఉండగా అ దిశగా చర్యలు చేపట్టక పోవడం ఇబ్బందులకు గురి చేస్తోంది. తొలుత ఆడ ప్రాజెక్టు ఫిల్టర్ నీళ్ళు వస్తాయని ఎంతో ఆశపడ్డ మండల వాసులకు తాజాగా ఎదురవుతున్న పరిణామాలు నిరాశకు గురి చేస్తున్నాయి. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకొని మండలం వరకు ఆడ ప్రాజెక్టు సురక్షిత నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

comments