Home కరీంనగర్ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలివ్వదు

పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలివ్వదు

panchayat-workers

గ్రామ పంచాయతీ రాబడి నుంచే ఇస్తారు, లెఫ్ట్ పార్టీలు, ఇతర ప్రతిపక్షాలు
కార్మికులను రెచ్చగొడుతున్నాయి, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయి,
హైదరాబాద్‌లో వెయ్యిమంది ఉద్యోగాలు పోగొట్టారు : సిఎం

మన తెలంగాణ / కరీంనగర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వామపక్షాలు, ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. శనివారం ఉమ్మపూర్ గ్రామంలోని మహాసముద్రం గండి చెరువు పనులను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఘాటుగా స్పందించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు ఉండవని గ్రామ పంచాయతీ రాబడి నుంచే వేతనాలు ఇస్తారని గుర్తు చేశారు. ముందుగా సిపిఐ, కాంగ్రెస్ ఇతర పార్టీల సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు కార్మికులను సమ్మెకు ఉసిగొలిపి హైదరాబాద్‌లో 1000 మంది కార్మికుల ఉద్యోగాలు పోగొట్టారని, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని సిఎం మండిపడ్డారు. ఇప్పటికైనా వామపక్షాల మాటలు నమ్మకుండా కార్మికులు విధుల్లో చేరాలని సూచించారు. ఎలాంటి నాయకుల బెదిరింపులకు అదిరేది.. బెదిరేది.. లేదని బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమించేదిలేదన్నారు.

మాకు ప్రజలే బాసులు

మన తెలంగాణ / హుస్నాబాద్ టౌన్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే బా సులని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించే వరకు ఎవరికి భయపడేది లేదని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు కుండబద్దలు కొట్టారు శనివారం హుస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను, మహా సముద్రం గండిని పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 45 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 15 సంవత్సరాల టిడి పి పాలనలో ఈ ప్రాంతం ఎడారిగా మారిందని అన్నారు .గత ప్రభుత్వంలో ఆంధ్ర పాలకుల కింద పని చేసి అభివృద్దిని మరిచారని ఇక ముందు తెలంగాణ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రెండున్నర ఏళ్లలో గండిపెల్లి, గౌరవెల్లి ప్రాజెక్టు లను పూర్తి చేసి 1.50 ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు .తోటపెల్లి ప్రాజెక్టును నేను గాని, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే సతీశ్ బాబు రద్దు చేయ లేదని దానిని అధికారులే చూసుకుంటారని అన్నారు.
గ్రామాల అభివృద్ధి కోసం 10 లక్షలు, నగర పంచాయతీ అభివృద్ధి కోసం కోటి రూపాయిలు, నా దత్తత చిగురుమామిడి మండల ముల్కనూరు గ్రామానికి 50 లక్షలు, మొత్తం 13.50 లక్షలు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం 2500 కోట్ల నిధులు ఇస్తామని ,గ్రామాల సంపూర్ణ అభివృద్ది కోసం గ్రామజ్యోతి కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు అభివృద్ధికి భాగ స్వాములు కావాలని కోరారు. నేడు గ్రామాలలోని పల్లెలు మురికి కూపాలుగా మారాయని, భూమి లేని పేదలు చనిపోతే దహనం చేసుకోవడానికి వైకుం టపాలిని ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికి మంచినీరు అ ందించకుంటే ఓట్లు అడగబోమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్.ఎల్.సి పి.సుధాకర్ రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మె ల్యేలు సతీశ్ బాబు, రసమయి బాలకిషన్, బొడిగ శోభ, పుట్ట మధు, విద్యా సాగర్‌రావు, జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, ఎస్‌పి జోయల్ డేవిస్, టిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్‌రెడ్డి, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపిపి భూక్య మంగ, టిఆర్‌ఎస్ నాయకులు తది తరులు పాల్గొన్నారు.