Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పంచాయతీ కార్మికుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

06RRGTKP03 06RRGTKP05రంగారెడ్డి: తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న ఆందోళన ఉద్రికత్తకు దారి తీసింది.. ఘట్‌కేసర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు గత నెల 1వ తేది నుంచి మండల పరిషత్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారు. వీరి వెంట ఉండి సీఐటీయు, ఏఐటీయు నేతలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పలువిధాలుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఏఐటీయు జిల్లా కార్యదర్శి జయచంద్ర, సీఐటీయు మండల కార్యదర్శి ఎ.మనోరంజన్‌రెడ్డితో పాటు పలువురు కార్మికులు ఈనెల ౩వ తేది నుంచి ఘట్‌కేసర్ ఆర్టీసీ బస్సు స్ట్టాండ్ వద్ద టెంట్ వేసి అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గురువారం మధ్నాహ్నం పోలీసుల అనుమతి లేదంటూ ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ టి.రవీందర్ ఆధ్వర్యంలో భారీగా దీక్ష శిబిరం వద్దకు చేరుకొన్ని దీక్ష చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. వీరిని తోటి కార్మికులు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. అతి కష్టం మీద జయచంద్ర, మనోరంజన్‌రెడ్డి, మిగతా కార్మికులను అదుపులోకి తీసుకొన్ని వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. వాహనాలను కార్మికులు అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు పక్కకు నెట్టి వెళ్ళిపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా మిగతా కార్మికులు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న సీపీఐ రాష్త్ర కార్యవర్గ సభ్యుడు రోయ్యల కృష్ణమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రమీళ, యాదమ్మ, యూసూఫ్‌బాబా, జిల్లా సీపీఎం నార్త్ జోన్ కమిటి కార్యదర్శి కొమటి రవి, నేతలు నిర్మల, తదితరులు వచ్చారు. పోలీసులు కార్మికుల పట్ల వ్యవహరించిన తీరు ను వారు తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రోయ్యల కృష్ణమూర్తి , కొమటి రవి, చింతల యాదయ్యలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని న్యాయంగా నిరసన కార్యక్రమాలుచేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనలు ఇవ్వాలని, వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతున్నా సీఎం పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు వామ పక్షలు ఉండగా ఉందని వారిపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా పోరాటం నిలిపేసే ప్రసక్తిలేదని వారు చెప్పారు. కార్మికులను, వారికి సంఘీభవం తెలుపుతున్న వారిని బెదిరిస్తున్నారని, అయిన భయపడేంది లేదని వారు అన్నారు. సమస్యలు పరిష్కారించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

Comments

comments