Home మంచిర్యాల పంచాయతీ పోరులో అతివలకే అందలం

పంచాయతీ పోరులో అతివలకే అందలం

Women key role in village development

 

గామాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర
జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో మహిళలే పోటీ
పంచాయతీ ఎన్నికల్లో పురుషాధిక్యానికి తెర
రిజర్వేషన్ల ప్రకారం భార్యలను బరిలో నిలిపిన నేతలు

మంచిర్యాల: జిల్లాలో గ్రామంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండగా సగానికి పైగా స్థానాలను మహిళలకే కేటాయించారు. చట్ట సభల్లో తక్కువ ప్రాతినిత్యం వహిస్తున్న మహిళలకు స్థానిక ఎన్నికలు వరంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ప్రాతినిత్యం రెండంకెలు దాటలేదు. ప్రభుత్వ విదానంతో గ్రామపంచాయతీ ఎన్నికలు 50 శాతం స్థానాలను మహిళలకే కేటాయించాలనే నియామవళితో పంచాయతీ పాలనలో పురుషాధిపత్యానికి తెరపడింది. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 308 పంచాయతీల్లో ఎన్నికలు జరుతుండగా 154 స్థానాలు మహిళలకు కేటాయించారు. దీంతో పాటుగా జనరల్ స్థానాల్లోని వీరు పోటీలో నిలిచే అవకాశం ఉంది. బెల్లంపల్లిలో మొత్తం 17 పంచాయతీలకు గాను 7 స్థానాలను మహిళలకు కేటాయించారు.

భీమిని 12 పంచాయతీల్లో 6, కన్నెపల్లి 15 పంచాయతీల్లో 9, కాసిపేట 22 పంచాయతీల్లో 10, నెన్నెల 19 పంచాయతీల్లో9, తాండూర్ 15 పంచాయతీల్లో 7, వేమనపల్లి 14 పంచాయతీల్లో 6, భీమారం 11 పంచాయతీల్లో4, చెన్నూర్ 30 పంచాయతీల్లో 17, దండేపల్లి 31 పంచాయతీల్లో 17. హాజీపూర్ 17 పంచాయతీల్లో 9, జైపూర్ 20 పంచాయతీల్లో 9, జన్నారం 29 పంచాయతీల్లో 16, కోటపల్లి31 పంచాయతీల్లో16, లక్షెట్టిపేట 18 పంచాయతీల్లో9, మందమర్రి 10 పంచాయతీల్లో 03 స్థానాలను మహిళలకు కేటాయించారు.

రిజర్వేషన్‌ల కారణంగా ఆయా పార్టీల నాయకులు వారి సతీమణులను రంగంలోకి దింపుతున్నారు. వీటితో పాటుగా జిల్లాలోని 2730 వార్డుల్లో 1371 వార్డులను మహిళలకు కేటాయించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీ చట్టం 2018 ప్రకారం రిజర్వేషన్‌లు 10 ఏళ్ల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పదవిలో ఉండి చిత్తశుద్ధితో పనిచేసే మరో ఐదేళ్ల పాటు పదవీలో ఉండే అవకాశం ఉంటుంది. చట్టం ప్రకారంగా మహిళలు సర్పంచ్‌గా గెలుపొందిన అనంతరం చిత్తశుద్ధితో గ్రామీణ అభివృద్ధికి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పోటాపోటీగా ప్రచారం….
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రజాప్రతినిధులు,నాయకులు జోరుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మంచిర్యాల ఎంఎల్‌ఏ దివాకర్‌రావు,బెల్లంపల్లి ఎంఎల్‌ఏ దుర్గంచిన్నయ్య సిర్పూర్ ఎంఎల్‌ఏ కోనప్పతో పాటు వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వారు మద్దతు పలుకుతున్న అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహిస్తూ భారీ మెజార్టీతో మద్దతు దారులను గెలిపించాలని కోరుతున్నారు. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి గడువు సమీపించడంతో ఆయా పార్టీ నాయకులు పల్లెల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Women key role in village development