Home కరీంనగర్ పడకేస్తున్న పల్లెలు

పడకేస్తున్న పల్లెలు

  • వైరల్ ఫీవర్లతో జిల్లా గజగజ
  • అప్రమత్తమైన జిల్లా అధికారులు
  • అధికారికంగా ఐదు డెంగ్యూ కేసులు నమోదు అనధికారికంగా ఇంకా ఎన్నో?
  • ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ

Karimnagar_Hospital_Feversమన తెలంగాణ-కరీంనగర్ : గత వారం రోజులుగా చాప కింది నీరులా మొదలైన జ్వరాలు. జిల్లా లో జడలు విప్పి కాటేస్తున్నాయి. ఒక్కరిద్దరితో మొదలైన జ్వరాలు వందల సంఖ్యకు చేరుకున్న క్రమంలో గ్రామాల్లో జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా యి. చిన్నా పెద్దా ఎవరనేది లేకుండా వైరల్ ఫీవర్ల దాడి పరంప ర కొనసాగుతోంది. జిల్లాలో తూర్పు దిశగా మొదలై. పశ్చిమ వైపుకు దూసుకెళ్లుతున్న జ్వరాలు అధికారులకు అంతుచిక్కడం లేదు. వాతావరణంలో మార్పులు పరిసరాల పరిస్థితుల వల్ల గాల్లో తేలుతున్న వైరల్ క్రిమి మనుషులపై దాడి చేసి జ్వరం రూపంలో బయట పడుతున్నాయి. జిల్లా కేంద్రంలో అత్యవసర సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందిం చేందుకు జిల్లా యంత్రంగం సిద్దమైందంటే జిల్లాలో వైరల్ విజృంభన ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే అధికారికంగా వెళ్లడించిన గణాంకాలు ఐదు డెంగ్యూ కేసులు నమోదు కాగా ప్రవేట్ ఆసుపత్రులో వందకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వైరల్ ఫీవర్ల సంగతి సరేసరే ! ? గర్రెపల్లి, కమలాపూర్, మర్రెపల్లి గూడం, గంభీరాం పేట, గజసింఘా పురం, పోతారం, తిమ్మపూర్, మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విషజ్వరాల పాలౌతున్న సందర్భాలు ఉండడంతో స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఆశవర్కర్స్ లతో వైద్యం అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి లో కొన్ని చోట్ల సరైన వసతులు లేక పోవడంతో గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి తరలి వస్తున్న రేగులు ఇటు కేంద్రాసుపత్రి… అటు ప్రైవేట్ ఆసుపత్రులకు చేరుతున్నారు. వైరల్ ఫీవర్ల లో కొన్ని ప్రమాదమైనవి కానప్పటికి ప్రధానంగా డెంగ్యూ వ్యాధి కి సంబంధించిన లక్షణాలు బయట పడుతుండంతో ప్రజలు హడలి పోతున్నారు.
వైరల్ ఫీవర్‌ను లక్షణాలను బట్టి సింటమాటిక్ ట్రీట్ మెంట్ తో నయం చేసే అవకాశం ఉన్నప్పటికి….రోజు రోజుకు తెల్ల రక్తకణాలు తగ్గి పోతుండంతో రోగి ప్రమాద స్థాయికి పోతున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికి పలు గ్రామాల్లోకి వెళ్లిన వైద్య బృందాలు ప్రజలకు సహకరించడం లేదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రధానంగా మంగళవారం నాడు గర్రెపల్లి లో ఏర్పాటు చేసిన వైద్యం శిబిరంలో అరకొర వసతులతో మొక్కబడిగా వైద్యం అందంచడంపై రోగి బంధువులు వాదులాటకు దిగారు..రక్త పరీక్షలు తదితర డయాగ్నాస్టిక్ టెస్ట్ ల కోసం ఎలాంటి సదు పాయాలు వైద్య శిభిరాల్లో లేక పోవడంతో వాటి కోసం రోగులు జిల్లా కేంద్రానికి రావల్సి వస్తోంది. ఇక ప్రధానాసుపత్రికి వస్తే అందాల్సిన వైద్యం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్థుతం అస్తవ్యస్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులైన ఒక రోజు ఎండ మరో రోజు చెదురు మొదురు వర్షపు చినుకులతో వాతావరణ మార్పులే కాదు,తాగు నీటి కలుషితం కూడ ఉంటోంది. వైరల్ సోకి విషజ్వరాలు,డెంగ్యూ జ్వరాలు వస్తుంటే అధికారు స్పందించిన తీరు ఎలా ఉన్నా..క్లోరినేషన్ కు దూరంగా ఉన్న పల్లెల్లో ముందు ముందు డయోరియా ప్రభలే అవకాశం లేక పోలేదు. ప్రస్థుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇవే కాకుండ ఇతర రకాల జ్వరాలను అదుపు చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది.
అవకాశం వారి పాలిట వరం
ఓ వైపు రోగాలతో అల్లాడుతూ ప్రాణాలు చేత పట్టుకొని వస్తున్న రోగుల స్థితి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు వరం గా మారుతోంది. ఇటు డయాగ్నస్టిక్ సెంటర్లు అటు హాస్పటల్స్ రోగులతో ఆడుకుంటున్నారు. పరీక్షల పేరుతో వేల రూపా యలను గుంజుతున్న డయాగ్నస్టిక్ సెంటర్లు అనుబంధంగా ఉ న్న ఆసుపత్రుల్లో చికిత్స పేరిట వేలాది రూపాయను దండు కుం టున్నారు. ప్రాణ భయంతో వచ్చే రోగులకు ఆస్పత్రి బిల్లు లు గుదిబండగా మారుతున్నాయని రోగులు సహా బంధువులు వా పోతున్నారు. వైరల్ జ్వరాల పేరు చెప్పి వేలు గుంజుతున్న ఆసు పత్రులపై జిల్లా వైద్యాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.