Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణీత గడువులోపు అనుమతులు

COLECTOR

మనతెలంగాణ/వికారాబాద్ జిల్లా : టిఎస్‌ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత సమయంలోపు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో టిఎస్‌ఐపాస్, జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కమిటీలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టిఎస్‌ఐపాస్ ద్వారా 88 పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తులు రాగా వాటిలో ఇప్పటికే 57 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన దరఖాస్తులకు సంబంధించి నిర్ణీత సమయంలోగా అనుమతులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం ఇప్పటికే అనుమతులు పొంది నడుస్తున్న పరిశ్రమలు తిరిగి రెన్యూవల్ నిమిత్తం 13 దరఖాస్తులు రాగా వాటిలో ఐదింటికి అనుమతులు ఇవ్వడం జరి గిందని చెప్పారు. మిగిలిన వాటికి కూడా నిర్దారించిన కాల వ్యవధిలో అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే నడుస్తున్న 88 పరిశ్రమలకు ప్రోత్సాహకాలకు గాను దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని, వీటి మంజూరు కోసం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కింద 19 యూనిట్లకు లక్షాన్ని నిర్దేశించడం జరిగిందని, దీనికి సంబం ధించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తు న్నట్లు ఆమె తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సమ్మయ్య, కాలుష్య నివారణ సంస్థ ఇఇ వెంకన్న, టిఎస్‌ఐఐసి మేనేజర్ మాధవి, డిపిఒ మాజీద్, విద్యుత్ శాఖ అధికారి దుర్గారావు, పరిశ్రమల చీఫ్ ఇన్స్‌పెక్టర రాజగోపాల్, జిల్లా ట్రెజరీ అధికారి కోమల, జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాదాస్, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ దశరథ్, నీటి పారుదల శాఖ అధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments