Home మహబూబ్‌నగర్ పరేషాన్..

పరేషాన్..

Rection-dilars-image

డీడీలు కట్టని డీలర్లు                                                                                                                                                ప్రశ్నార్దకంగా మారిన ప్రజా పంపిణీ                                                                                                                              జూలై 1 నుంచి నిరవదిక సమ్మె                                                                                                                                  తిండి గింజల తిప్పలు తప్పవా..!                                                                                                                            ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది : అధికారులు

మన తెలంగాణ/మిడ్జిల్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు ప్రభు త్వం రేషన్ డీలర్ల ద్వారా అందిస్తున్న రేషన్, జూలై 1 నుం చి డీలర్ల నిరవధిక సమ్మె చేపట్టనుండటంతో పంపిణీ ఆగిపోనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండటంతో పేద ప్రజలకు తిండి గింజల తిప్పలు తప్పేలా లేవు. దశాబ్దాల కాలంగా పంపిణీ వ్యవప్థలో కీలక పాత్ర వహించిన రేషన్ డీలర్లు తమ సమస్యల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చింది. డిమాండ్‌ల సాధన దిశగా పోరాటానికి సిద్ధం కావడంతో ప్రజా పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి పాలమురు జిల్లా వ్యాప్తంగా 2,020 రేషన్ దుకాణాలున్నాయి. డీలర్లు డీడీలు కట్టకపోవడంతో జూలై నేల బియ్యం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.

ఉద్యోగ భద్రతకే పోరాటం..
ప్రభుత్వాలు ప్రవేశపేట్టిన పథకాలను ప్రజా పంపిణీ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో అమలుచేస్తున్న రేషన్ తమ ఉద్యోగ భద్రత, న్యాయమైన కోర్కే ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థను నిలిపేందుకు గాను ప్రభుత్వానికి చెల్లించాల్సిన డీడీలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్‌లను సాధించుకునేంత వరకు నిరవధిక సమ్మేకు పిలుపు నిచ్చిం ది. గతంలో చౌక ధరల దుకాణముల ద్వారా తొమ్మిది వస్తువులు సరఫరా అయ్యేవి. ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా అవుతుండటంతో కమీషన్ తక్కుగా రావడమే కాక, బియ్యం ఓక్కో బస్తాలో తరుగు వస్తుడటంతో నష్టాల బాట పట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ప్రభు త్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను సరఫరా చేస్తు ప్రభుత్వంకు అండగా ఉన్నందున తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవ వేతనం ఇవ్వాల్సివందేనని పట్టుబట్టారు. అదేవిధంగా హెల్త్ కార్డులను ఇవ్వడంతో పాటు ప్రతి రేషన్ డీలర్‌కు డబుల్ బేడ్ రూం ఇండ్లను ఇవ్వాలని, డీలర్‌షిప్ రేన్యూవల్ గడువు అయిదు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం గతంలో విడుదల చేసిన నాలుగు వందల కోట్ల డీలర్ల సంక్షేమ నిధిని డీలర్లకు పం పిణీ చేయలని డిమాండ్ చేస్తున్నారు. పలు దఫాలుగా పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిగిన చర్చల అనంతరం చర్చలు విఫ లం కావడంతో సమ్మేకే మొగ్గు చూపుతు జూలై 1 నుం చి నిరవదిక సమ్మే దిశగా ముందుకు సాగుతున్నారు. తమ కోర్కేలను సాదించుకునేంత వరకు సమ్మే ఆపేదిలేందటు జూలై మాసం పంపిణీ కోరకు డీడీలు చేల్లించక సమ్మేకు సై అంటున్నారు.

ఎట్టి పరిస్థితిలో పంపిణీ ఆపేది లేదు : ఆర్డీవో లక్ష్మీనారాయణ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తోమ్మిది లక్షల మందికి బి య్యం సరఫరా అవుంది. రేషన్ డీలర్లు డీడీలు కట్టకుం డా నిరవదిక సమ్మేకు పిలుపు ఇవ్వటంతో నిరు పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారు. ప్రభుత్వ నిబందనల మేరకే రేషన్ డీలర్ల నియామకం జరుగుతుంది. వాటికి అనుగునంగానే వారికి నిర్దేశించిన కమీసన్ ఇవ్వడం జరుగుతుంది. వారి ఇబ్బందులు ఎమైన ఉం టే ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కాని డిడిలు కట్టకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కాకుండా పంపిణీ కార్యక్రమం చేపడు తాం. ప్రస్తుతం సమ్మే కారణంగా ప్రజా పంపిణీ సాగనందున ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కోంటున్నందున ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని మహబుబ్‌నగర్ రాజస్వ మండల అధికారి వడ్ల లక్ష్మినారాయణ అన్నారు. ప్రత్యాణ్మాయ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తామని ఆర్డీవో లక్ష్మీనారాయణ ‘మన తెలంగాణ’కు తెలిపారు.

మాడిమాండ్‌లు అంగీకరించాలి :
సత్యనారాయణ – రేషన్‌డీలర్ల సంఘం మాజీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి – మిడ్జిల్
గత 30 ఎళ్లుగా ప్రజలకు చౌకధర దుకాణాలలో ప్రభుత్వ నిబందనల మేరకు సరుకులు విక్రయిస్తున్నా ము. మాకు ఇప్పడు వచ్చిన అధునాతన విధానాల వల్ల గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు అన్ని రకా ల నిత్యవసర వస్తువులు చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి. గతంలోను సమ్మె చేసినప్పుడు అధికారులు మా కోర్కేలు నేరవేరుస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. అధికారులు మా న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రేషన్ డీలర్లు ఎదుర్కోంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. అప్పుడే మేము డిడిలు కట్టి ప్రజలకు ఎదావిదిగా సరుకులు పంపిణీ చేస్తాం.