Search
Saturday 22 September 2018
  • :
  • :

పవన్ బర్త్‌డే కానుకగా మరోసారి…

BabaSehgal_Pathచిరంజీవి నటించిన రిక్షావోడు సినిమాలో రూపుతేరా మస్తానా… అనే పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పాపులర్ పాప్ సింగర్ బాబా సెహగల్. ఆతర్వాత జల్సా, అదుర్స్, గబ్బర్‌సింగ్‌లాంటి సినిమాల్లో పాటలు పాడి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గబ్బర్‌సింగ్ టైటిల్ సాంగ్ పాడిన సమయంలో పవన్‌కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ చూసి ఆయనకి అభిమానిగా మారాడు బాబాసెహగల్. ఆతర్వాత పవన్‌పై ఓ స్పెషల్‌సాంగ్ రాసి కంపోజ్ చేసి 2012లో పవర్‌స్టార్ బర్త్‌డే కానుకగా విడుదల చేశాడు. ఆ పాటకి అప్పట్లో మంచి స్పందన వచ్చింది.

తాజాగా అదే ఫీట్‌ను మరోసారి రిపీట్ చేయనున్నాడు బాబా సెహగల్. ఈ ఏడాది పవన్ బర్త్‌డే రోజైన సెప్టెంబర్ 2న పుట్టినరోజు కానుకగా ఓ స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశాడు. ఇక ఇప్పటివరకు సింగర్‌గా రాణించిన బాబా సెహగల్ ప్రస్తుతో నటుడిగా మారి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను రుద్రమదేవి సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఇది కాకుండా నాగచైతన్య, గౌతమ్‌మీనన్, శింబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం లో మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడు.

Comments

comments